కాళేశ్వరంతో స్వరాష్ట్రం ముఖచిత్రం మారింది ఎందరో త్యాగం చేసి భూములు ఇచ్చారు.. ముంపు బాధితులను అందరినీ ఆదుకుంటాం ఎండనక, వాననక కష్టపడి పనిచేశారు.. ఇంజినీర్లు, కార్మికులందరికీ సెల్యూట్ చేస్తున్నా.. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ సామాజికసారథి, సిద్దిపేట: దేశం మొత్తం కరువు ఉన్నా.. ఇక తెలంగాణలో మాత్రం ఆ ఛాయలే రావని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరాయంగా జలాలను అందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టులతో పాటు […]
సారథి, రామడుగు: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైన కరీంనగర్జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపు హౌస్ నుంచి మిడ్ మానేరుకు అదనంగా మూడవ టీఎంసీ జలాల తరలింపునకు చేపట్టబోయే నూతన కాల్వ భూసేకరణను నిలిపివేయాలని శానగర్ గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ కోమల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్మించిన వరద కాల్వ భూసేకరణలో చాలా మంది రైతులు తమ విలువైన భూముల కోల్పోయారని, ఇప్పుడు రెండవ, మూడవ సారి ఇండ్లు, భూములను […]
కఠోర ప్రయత్నం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది ఉపనదులను జీవనదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే రైతుగర్వంగా సమాజంలో తలెత్తుకుని బతకాలన్నదే ఆయన ఆశ ‘సారథి’ ఇంటర్వ్యూలో సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సారథి, మెదక్: ప్రణాళికతో గోదావరి నీళ్లు మళ్లించి జీవం కోల్పోయిన ఎన్నో వాగులు, ఉప నదులు, చెక్‌డ్యాంలు, చెరువులకు సజీవ సాగునీటి వనరులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కిందని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి […]
తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చేసింది ఇదే స్ఫూర్తితో తుపాకులగూడెం, దుమ్ముగూడెం పనులు కాళేశ్వరం పర్యటనలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు సారథి న్యూస్, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా సాగుతోందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తికావడంలో కృషిచేసిన నీటిపారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన […]
గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులే కాక మత్స్యకారులు కూడా బాగుపడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరి దిశ మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. అదివారం ఆయన కుందనపల్లి, గోదావరినది వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని కులవృత్తులకు న్యాయం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.