సామాజిక సారథి , నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామం లో ని తోట పల్లి సుబ్రమణ్యం విద్యాలయం లోనీ పాఠశాలలో1997 – 1998 పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు బాలాజీ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సుబ్బయ్య విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుందన్నారు.
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన జగన్నాథ్ రెడ్డి , హనుమంత్ రావు , రామయ్య , గోపాలకృష్ణ, కుసుమలత ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి జ్ఞాపకాల అందజేశారు. సమావేశం లో నాగరాజు , ధర్మ , వరప్రసాద్ , లక్ష్మణ్ రావు, శివశంకర్, చంద్ర శేఖర్ , పుల్లయ్య , మల్లేష్, మయూరి, శ్రీవాణి, సరిత, లక్ష్మీ, స్వప్న, సునిత, రాగిణి ఉన్నారు .