Breaking News

SIDDIPET

100 పడకలతో కోవిడ్ వార్డు

100 పడకలతో కోవిడ్ వార్డు

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన 100 పడకల ప్రత్యేక కోవిడ్​ వార్డు, ఐసోలేషన్​ బ్లాక్​ను మంత్రి హరీశ్​రావు బుధశారం ప్రారంభించారు. డాక్టర్లు, వైద్యసిబ్బందితో ఆయన మాట్లాడారు. చిరునవ్వుతో వైద్యం అందిస్తే రోగం నయమవుతుందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, స్టాఫ్​నర్సుల సంఖ్యను పెంచుతామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్​వెంకట్రామరెడ్డి, జిల్లా వైద్యాధికారులు, టీఆర్ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More

ప్రతిగ్రామంలో 50 కల్లాలు

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతి గ్రామంలోనూ 50 కల్లాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో ఆయన డివిజన్​ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీలు నెలలో 3రోజులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే సతీశ్​కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్​, డీఎఫ్ వో శ్రీధర్, ఆర్డీవో […]

Read More

యువకుడిని కాపాడిన పోలీసులు

సారథిన్యూస్​, సిద్దిపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. అతడి మొబైల్​ నంబర్​ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. సిద్దిపేటకు చెందిన కాశితే శ్రీనాథ్​ గురువారం రాత్రి ఇంట్లో గొడవపెట్టుకొని తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లాడు. దీంతో అతడి తండ్రి ఐలయ్య వన్​టౌన్​ పీఎస్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ సైదులు, ఐటీ సిబ్బందితో కలిసి శ్రీనాథ్​ మొబైల్​ నంబర్​ ఆధారంగా అతడు స్థానిక ఎల్లమ్మ ఆలయం […]

Read More

పరిహారం ఇస్తేనే పనులు చేయనిస్తం

సారథి న్యూస్​, హుస్నాబాద్: ‘పరిహారం చెల్లించాకే పనులు చేపట్టండి’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బుధవారం ప్రాజెక్టు పనులను అడ్డకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులను చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు పునరావాస ప్యాకేజీ పరిహారం అందిస్తామని అధికారులు సంతకాలు చేయించుకొని సంవత్సరం కావస్తున్నా, నేటికి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.

Read More
టీఆర్​ఎస్​ జెండాలు పాతి ధర్నా

అధ్వానంగా రోడ్లు

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో రోడ్లు ఆధ్వానంగా మారినా అధికారులు, ​ మంత్రులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గుంతలుపడ్డ రోడ్లపై వారు టీఆర్​ఎస్​ జెండాలు పాతి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతూ.. వాహనదారులకు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు అక్క శ్రీనివాస్​, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణలత, రాజయ్య, కిష్టస్వామి, రాజు, సది తదితరులు పాల్గొన్నారు. […]

Read More

ఇలాచేస్తే కరోనా రమ్మన్నా రాదు

సారథి న్యూస్​, సిద్దిపేట: కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని సిద్దిపేట పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఊరూరూ తిరిగి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాచైతన్య రథం ద్వారా ఎల్​ఈడీ స్క్రీన్ ను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం దుబ్బాక పీఎస్​ పరిధిలోని అప్పనపల్లి, పెద్దగుండవెల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ సీఎం కేసీఆర్​, మంత్రి హరీశ్​రావు మాట్లాడిన […]

Read More

పల్లెలన్నీ పచ్చబడాలి

సారథిన్యూస్, రామడుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలన్నీ పచ్చ బడాలని కరీంనగర్​ కలెక్టర్​ శశాంక పేర్కొన్నారు. గురువారం ఆయన రామడుగు మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో ఆరోవిడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎస్సీ కాలనీలో హరితవనం పార్కును సందర్శించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఏసీసీ రామేశ్వర్​, మున్సిపల్​ చైర్మన్​ రాజనర్సు, సీఐ సైదులు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్​ కోమల్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, సర్పంచ్ జీవన్, ఎంపీటీసీ […]

Read More

వానాకాలంలోగా రైతు వేదికలు పూర్తి

సారథి న్యూస్, హుస్నాబాద్: వానాకాలంలోగా జిల్లాల్లో రైతువేదికలు నిర్మించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో సమీక్షించారు. రెండు నెలలలోపు జిల్లాలో 126 రైతు వేదిక నిర్మాణాలు పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని, ఇందుకోసం జిల్లాస్థాయిలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏజెన్సీలను మంత్రి కోరారు. రైతు వేదికల నిర్మాణాలకు నిధుల కొరత లేదని, జిల్లాలో 126 వేదికల నిర్మాణాలు చేపట్టాలని, ఒక్కోదానికి రూ.22లక్షల చొప్పున […]

Read More