భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ భయబ్రాంతులకు గురైన రైతులు ఖండించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సామాజికసారథి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి పూర్తి పరిహారం అందక నిరసనలు చేపడుతున్న భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్చేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చి నిర్వాహిత రైతులపై కర్కశంగా దాడిచేశాయి. నిర్వాసితులను ఏ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారో తెలియకుండా భయబ్రాంతులకు గురయ్యారు.గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై దాడి చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని కాంగ్రెస్ మాజీ […]
– ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సామాజిక సారథి, సిద్దిపేట: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్, రంగ నాయక్ తోపాటు ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు ఏ ప్యాకేజీ అందించారో అదే విధంగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోతున్న […]
సారథి, హుస్నాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు నీరు లేక ఎండుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. వానాకాలంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా అన్నదాతలు ఆనందంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి పంటలు వేశారని చెప్పారు. పంటలన్నీ పొట్టదశలో ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎండిపోతున్నాయని […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి భూ నిర్వాసితులకు 12 ఏండ్లయిన పరిహారం ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం నీటిపారుదల శాఖ సెక్రటరీ, సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. గౌరవెల్లి ప్రాజెక్టు రీ డిజైన్‌లో భాగంగా 1.4 నుంచి నుంచి 8.2 టీఎంసీల సమర్థ్యాన్ని పెంచడంతో ప్రాజెక్టు కింద రెండవసారి నిర్వాసితులు భూములను కోల్పోయారన్నారు. భూ నిర్వాసితులు ఏండ్ల తరబడి నష్టపరిహారం కోసం మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పరిహారం చెల్లించలేదని నిర్వాసితులు కన్నెర్ర చేశారు. తమకు పూర్తి పరిహారం చెల్లించేవరకు పనులు చేసుకోనివ్వబోమంటూ అడ్డగించారు. సిద్దిపేట జిల్లా గూడాడిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వెళ్లిన అధికారులు, కాంట్రాక్టర్లను శుక్రవారం నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు పునరావాస ప్యాకేజీ డబ్బులు చెల్లించలేదని వారు వాపోయారు. అధికారులు సంతకాలు తీసుకొని సంవత్సరం కావస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని పరిహారం చెల్లిస్తామని హామీ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ‘పరిహారం చెల్లించాకే పనులు చేపట్టండి’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బుధవారం ప్రాజెక్టు పనులను అడ్డకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులను చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు పునరావాస ప్యాకేజీ పరిహారం అందిస్తామని అధికారులు సంతకాలు చేయించుకొని సంవత్సరం కావస్తున్నా, నేటికి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇప్పటికే 85శాతం మేర పూర్తి మెట్టప్రాంతానికి గోదావరి జలాలు 1.06లక్షల ఎకరాలకు సాగునీరు సారథి న్యూస్, హుస్నాబాద్: మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ వనులు తుదిదశకు చేరాయి. త్వరితగతిన వనులు పూర్తిచేసి దసరాలోగా రిజర్వాయర్ లోకి గోదావరి జలాలను విడుదల చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 90వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలకు మొత్తంగా 1.06 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తారు. […]
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా భావించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారంలో జరిగిన అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ఎంతమంది రైతులు, నిర్వాసితులకు నష్టపరిహారం అందించారో చెప్పాలన్నారు. అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ జరిపించాలని […]