*శ్రీను మృతికి కారకురాలైన ప్రిన్సిపల్, వార్డెన్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* *బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి* *తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్ సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో :ధర్మాపూర్ మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల లో ఆరవ తరగతి చదువు తున్న విద్యార్థి శ్రీను అనుమానస్పద గా బుధవారం మృతి చెందారు.హన్వాడ మండల కేంద్రానికి చెందిన బ్యాకరి కృష్ణయ్య అంజమ్మల దంపతుల రెండవ […]
కరోనా నేపథ్యంలో సర్కారు నిర్ణయం 16న ముగిసిన సంక్రాంతి హాలీ డేస్ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థలకు పొడిగింపు మెడికల్కాలేజీలకు మినహాయింపు సెలవులు రద్దుచేయాలని ఉపాధ్యాయ, ప్రైవేట్స్కూళ్ల యాజమాన్యాల డిమాండ్ పిల్లల చదువులపై పేరెంట్స్ఆందోళన సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మెడికల్కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు 16వ […]
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా […]
సామాజిక సారథి, తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సీఎల్ఆర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉయ్యాలవాడ, కోడేర్, తాడూర్ బీసీ గురుకులాల్లో 600మంది విద్యార్థులకుగాను 12మంది టీచర్లు పనిచేస్తున్నారన్నారు.16సెక్షన్లు ఉంటే సెక్షన్ కి ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరన్నారు. 80మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పడుకోవడానికి కూడా వసతులు లేని స్థితిలో […]
కరోనా నిలకడగానే ఉంది మూడో దశ ముప్పుపట్ల అప్రమత్తంగా ఉండాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి సోమవారం కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థల్లో ఎవరికి వారు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, […]
సామాజిక సారథి, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ […]
సారథిన్యూస్, రామడుగు: ఇటీవల కొంతకాలంగా కురుస్తున్న భారీవర్షాలు రైతాంగాన్ని నిండా ముంచాయి. ఈ జోరువానతో ఇప్పటికే పలుచోట్ల పాతమిద్దెలు కూలిపోయాయి. పలువురు గాయపడ్డారు. వరదతాకిడికి కొందరు గల్లంతయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. గాంకుంట్ల చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతంలో స్కూలు నిర్మాణం చేపట్టడంతో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. కరోనా లాక్ డౌన్ కావడంతో ఎవరూ ఈ పాఠశాలను పట్టించుకోవడం లేదు. రోజు ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం […]
ప్రకటించిన సీఎం జగన్ సారథి న్యూస్, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు.అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు […]