సామాజిక సారథి, ఆమనగల్లు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్, పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 10 రోజుల్లో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు కావలసిన ఋణ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ […]
సామాజిసారథి, హైదరాబాద్: రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్ […]
సామాజిక సారథి, సిద్దిపేట: అన్నదాతలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లిలో రైతులతో ఆయన మాట్లాడారు. వానకు తడవగా.. ఎండబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు […]
సారథి న్యూస్, ఖమ్మం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద 25 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఖమ్మంలోని పార్శిబందం ప్రాంతానికి చెందిన సీహెచ్ కృష్ణ, రాము అనే వ్యక్తులు రేషన్ బియ్యాన్ని రెండు ఆటోల్లో తరలిస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరాములు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 18 […]
సారథిన్యూస్, కోడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని దారిమళ్లించి సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ రేషన్‌డీలర్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కోడేరు మండల కేంద్రంలోని రేషన్షాప్నెంబర్ 3 డీలర్ శారద భర్త శ్రీనివాసులు 95 కిలోల బియ్యాన్ని దారి మళ్లించాడు. కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై పౌరసరఫరాల సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని డీలర్ ను అదుపులోకి తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు తెలిపారు.
సారథిన్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి మాట్లాడుతూ.. కరోనా, లాక్‌డౌన్‌తో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అందుకే వారికి తమవంతుగా ఈ సాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి గుండా రాజు, సభ్యులు శరత్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భేణిగోపాల్ త్రివేది, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]