Breaking News

POLICE

బొంకూర్ పెద్దవాగు.. ఉధృతం

సారథిన్యూస్​, గద్వాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతుల పంటలు నీటమునిగాయి. వరద ధాటికి రాకపోకలు ఆగిపోయి పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు.

Read More

ఈ దొంగ చాలా రిచ్ గురు!

సారథిన్యూస్​, హైదరాబాద్​: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్​స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్​ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది మాత్రం హైటెక్ దొంగ. ఇతగాడు కేవలం ఫ్లైట్​లోనే ప్రయాణాలు సాగిస్తుంటాడు. నేరుగా స్పాట్​కు చేరుకుంటాడు. అనంతరం పనిపూర్తిచేసుకొని తిరిగి వెళ్లిపోతుంటాడు. ఈ హైటెక్​ దొంగ గురించి సైబరాబాద్​ కమిషనర్​ సజ్జనార్​ తెలిపారు. ​ ఛత్తీస్​గఢ్​కు చెందిన గంగాధర్​ నొయిడాలో స్థిరపడ్డాడు. అక్కడ ఓ […]

Read More

నిఘానీడలో నాగన్​పల్లి

సారథి న్యూస్, నారాయణఖేడ్: మెదక్​ జిల్లా కంగ్టి మండలంలోని నాగన్​పల్లిలో గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి రూ.1.2 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. గురువారం కంగ్టి ఎస్​ఐ అబ్ధుల్​ రఫిక్​ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులే సొంత ఖర్చుతో కెమెరాలు ఏర్పరుచుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ, బీజేపీ మండలాధ్యక్షుడు సిద్దారెడ్డి, ఎంపీటీసీ, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More

అల్లూ అర్జున్​పై కేసు!

అనుమతులు లేకుండా సినిమా షూటింగ్​ చేస్తుండటంతో తెలుగు సినీహీరో అల్లూ అర్జున్​పై ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ పీఎస్​లో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్​ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అల్లూ అర్జున్​, పుష్ప చిత్ర యూనిట్​ కుంటాల జలపాతాన్ని సందర్శించడమే కాక అక్కడికి సమీపంలోని తిప్పేశ్వర్​ అటవీప్రాంతంలో షూటింగ్​ చేశారు. దీంతో సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్​, పుష్ప సినిమా […]

Read More

వాన ఎక్కువైంది జర భద్రం

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో గత రెండ్రోజులగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మునగాల ఎస్సై సత్యనారాయణగౌడ్​ సూచించారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మునగాల మండలంలోని తాడువాయి నుంచి తాడువాయి తండా మధ్యలో ఉన్న అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నదన్నారు. ఈ మార్గాల గుండా వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా మునగాల నుంచి గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, వెల్దండ, చీదేళ్ల, తంగెళ్ల గూడెం, […]

Read More

రాగిణి అతితెలివి.. అధికారులకు చుక్కలు

డ్రగ్స్​ కేసులో ఇటీవల పోలీసులకు దొరికిన కన్నడ హీరోయిన్​ రాగిణి ద్వివేది.. సీసీబీ అధికారుల ముందు తన సినిమా తెలివితేటలు ప్రదర్శించింది. అధికారులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. రాగిణి డ్రగ్స్​కేసులో సీసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీసీబీ అధికారుల అదుపులో ఉన్నది. ఆయితే ఆమెకు శనివారం బెంగళూరులోని కేసీ జనరల్​ ఆస్పత్రుల్లో డ్రగ్స్​ టెస్టులు చేశారు. ఇందులో భాగంగా ఆమె యూరిన్​ను సేకరించారు అధికారులు. అయితే రాగిణి మాత్రం యూరిన్​లో […]

Read More

కాళన్నను మరవద్దు

సారథి న్యూస్, రామడుగు: ఒక్క సిరాచుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ యావత్​ సమాజాన్ని మెల్కోలిపిన కాళోజీ చిరస్మరణీయుడని రామడుగు ఎస్సై అనూష పేర్కొన్నారు. కాళోజీ 107 వ జయంతి సందర్భంగా బుధవారం ఆమె కరీంనగర్ జిల్లా రామడుగులో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చొప్పదండి సీఐ రమేశ్​, పోలీస్​సిబ్బంది పాల్లొన్నారు.

Read More

కర్ణాటక డ్రగ్స్​ రాకెట్​లో సినీతారలు!

కర్ణాటకలో మొదలైన డ్రగ్స్​ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్​ లంకేశ్​ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్​ రాగిణి ద్వివేది కి డ్రగ్స్​ రాకేట్​తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె […]

Read More