సారథిన్యూస్, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేసినట్టు […]
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నది. ఇప్పటికే బాలీవుడ్‌లోని నెపోటిజంపై పలువురు సీనీ నటులు, ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల భామ తనూశ్రీ దత్తా సుశాంత్ కేసుపై స్పందించారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడమే ఉత్తమమని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై పోలీసులను పూర్తిగా నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. వారు రాజకీయనాయకుల […]
చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్ తరన్ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్ తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్‌చేశారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. […]
ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్ గంజ్‌కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్ ఓ పోలీస్‌ను రివాల్వర్‌తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
సారథి న్యూస్, బెజ్జంకి: ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా చేర్యాలలో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మత ఘర్షణలు ప్రేరేపించేలా ఎవరైనా సోషల్‌మీడియాలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో చేర్యాల ఎస్సై మోహన్ బాబు, చేర్యాల తాజుమ్ ప్రెసిడెంట్ అబ్దుల్ […]
సారథి న్యూస్ : కొందరు పోలీసులు ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై తాళం చెవితో దాడి చేశారు పెట్రోలింగ్ పోలీసులు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పోడిచారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు […]
ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్‌శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌శాఖ అధికారులు చెప్పారు.
సారథి న్యూస్, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్ రెడ్డి (32) భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. […]