సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ నాయకుడు మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య, జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, చందు, తౌఫిక్, మంథని మధు తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: కుట్రపూరితంగానే కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకు వెళ్లి రామగుండం నగరపాలక సంస్థ కో ఆప్షన్ ఎన్నికను వాయిదా వేయించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంగళవారం టీఆర్ఎస్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్ రామగుండం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో టీఆర్ఎస్కు 39 మంది కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్‌కు 11 మంది మాత్రమే ఉన్నారు. కార్పొరేటర్ల మెజార్టీతో టీఆర్ఎస్కు చెందిన వ్యక్తి కో-ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికవుతారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు […]
సారథి న్యూస్, రామగుండం: మానవత్వం మంటగలుస్తున్న నేటి పరిస్థితిల్లో మానవీయతను చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనార్థులకు అసరాగా, అనాథలకు అదుకోవడమే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం గోదావరిఖని పట్టణంలోని స్థానిక చౌరస్తాలో ఓ అనాథ వృద్ధురాలిని తన వాహనంలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కన ఉన్న ఓ వృద్దురాలిని షెల్టర్‌కు తరలించి మానవీయతను చాటుకున్నారు. మంత్రి కె.తారక రామారావు […]
సారథిన్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకం మహత్తరమైనదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పేదప్రజలు సొంతింట్లో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు పాతపెల్లి […]
సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ కార్యకర్త ఎంఎన్ శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా ఇచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గుంటూరుపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఓదార్చారు. ఆత్మహత్యకు పాల్పడిన శివారెడ్డి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మృతుని కుమార్తెకు వైద్యసదుపాయం కల్పిస్తామని భరోసా కల్పిస్తామన్నారు.
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పల్లెనిద్ర చేపట్టారు. అక్కడే బసచేసి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు.
సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సారథిన్యూస్, రామగుండం: రామగుండం కమిషనరేట్ పరధిలో గణేశ్ మండపాలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నివారణ గురించి అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు.