కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీసినవ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపిస్తే నీ వెంట ఉంటాం ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్ మంగి విజయ్ సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రజలకు అండగా నిలుస్తూ పనిచేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై.. బీజేపీ నాగర్కర్నూల్అసెంబ్లీ ఇన్చార్జ్ దిలీప్ ఆచారి స్థాయికి మించి వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్ మంగి విజయ్, టీఆర్ఎస్ నేత మంగి విజయ్ హెచ్చరించారు. నీ గత చరిత్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. […]
జడ్పీ చైర్ పర్సన్‌పై అనర్హత వేటు నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు తీర్పు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్యపై నాగర్‌కర్నూల్ కోర్టు అనర్హత వేటువేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తన సంతానం వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. పద్మావతి తప్పుడు వివరాలు సమర్పించారని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెపై పోటీచేసిన అభ్యర్థి సుమిత్ర కోర్టుకు ఆశ్రయించంతో నాగర్‌కర్నూల్ ఎలక్షన్ ట్రిబ్యునల్ కోర్టు గురువారం ఈ మేరకు తీర్పును […]
ప్రభావం చూపలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు అంతా అధికారపార్టీదే హవా సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లలేని నాయకులు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ పొలిటికల్హీట్రాజుకుంటోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఫలానా పార్టీ నుంచి ఫలానా నాయకుడు పోటీచేస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిన్నాచితక లీడర్లు సైతం అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వెళ్లాలని తమ అంచనాల్లో ఉన్నారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు మాత్రం కాస్తా స్తబ్దంగానే ఉన్నాయని […]
సామాజికసారథి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు, యువనేత, తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసొసియేషన్ చైర్మన్ డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి 49వ జన్మదిన వేడుకలను గురువారం యువకులు పెద్దఎత్తున జరుపుకున్నారు. కేక్‌కట్‌చేసి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.శేఖర్, మాజీ అధ్యక్షుడు సుభాష్, మాజీ ఎంపీపీ శాంతనరసింహ, ఉపసర్పంచ్లు ఎండీ రఫీ, సి.తిరుపతయ్య, గౌరి తిరుపతయ్య, బండి చెన్నయ్య, వార్డుసభ్యులు, నాయకులు, కార్యకర్తలు […]
అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా రూ.100కోట్లతో బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవానికి రేపు మంత్రి కేటీఆర్ రాక నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తాను ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్షాలకు వాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]
తండ్రి జ్ఞాపకార్థం బెంచీల వితరణ సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల మాజీఎంపీపీ పకాడి జయప్రకాశ్ (జేపీ) మరోసారి తన గొప్ప సేవాగుణాన్ని చాటుకున్నారు. ప్రయాణికులు, సామాన్యులు, సందర్శకుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి తహసీల్దార్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, సీఐ కార్యాలయం ఆవరణలో సిమెంట్ బెంచీలను ఏర్పాటుచేశారు. కాగా, మండలంలోని బొల్లంపల్లి పంచాయతీ చల్లపల్లి గ్రామానికి చెందిన దివంగత మాజీ సర్పంచ్ పకాడి రత్నయ్య ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. అప్పట్లో పేదలకు […]
పేదల కోసం ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపుపై అక్కసు జీర్ణించుకోలేక రద్దుచేయించిన ఓ బడా నేత సొంతపార్టీ నేతలే క్యాన్సిల్ చేయించడంపై ఎమ్మెల్సీ గుస్సా తనకు అడ్డంకులు సృష్టించడంపై కీనుక మరోసారి అధికారపార్టీలో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి.. నేతలు బలాబలాలను సరిచూసుకుంటున్నారు.. పోటాపోటీగా పర్యటనలు, కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేపార్టీలో రెండు వర్గాల మధ్య నిశ్శబ్ధయుద్ధం నడుస్తోంది.. […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ ఆలయం పున:ప్రతిష్టాపన సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం మహా మండల పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుణ్యహవచనం, అభిషేకం, గణపతి నవగ్రహ మన్య సూక్తహోమం భక్తాంజనేయ స్వామి సహస్ర నామావళి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమాలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గ్రామస్తులు సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వరరావు, రుక్మిణి దంపతులను […]