Breaking News

MLA

కొత్తచట్టంతో కబ్జాలకు చెక్​

సారథి న్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్​ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూచట్టంతో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అధికారుల అవినీతికి చెక్​ పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆదివారం రామగుండం, పాలకుర్తి, అంతర్గాం నుంచి గోదావరిఖని జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే చందర్​, ఎంపీ వెంకటేశ్​ నేతకాని ప్రారంభించారు. ర్యాలీలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, […]

Read More

ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు మాములుగా లేవుగా!

అక్రమాస్తుల కేసులో ఏసీబీ చిక్కిన మల్కాజ్​గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు చూస్తుంటే ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోతుందట. అతడికి ఏకంగా రూ. 100 పైనే ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నరసింహారెడ్డికి ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిన్న జరిపిన సోదాల్లో ఏసీపీ ఇంట్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్​లో రెండు ఇండ్లు, హఫీజ్​పేట్​లో 3 […]

Read More

విశాఖలో టీడీపీకి మరో షాక్​!

సారథిన్యూస్​, విశాఖపట్నం: ‘మేము మూడు రాజధానులకు ఒప్పుకోం.. అమరావతే ఆంధ్రుల రాజధాని’ అని మంకుపట్టు పట్టిన టీడీపీకి ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇప్పటికే విశాఖకు చెందిన పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సాఆర్​ కాంగ్రెస్​లో చేరారు. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్​బై చెప్పనున్నారని సమాచారం. గణేశ్​తో పాటు మరో ఎమ్మెల్యే కూడా చంద్రబాబుకు వీడ్కోలు చెప్పనున్నారట. గణేశ్​.. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆదివారం ఆయన​ సీఎం […]

Read More

నాలుగేండ్ల తర్వాత..

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామ శివారు లోని సోమాజిచెరువు నాలుగేండ్ల తర్వాత అలుగుపారడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చెరువు మత్తడి దుంకింది. దీంతో పిల్లలు, యువకులు అక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాలవారు అక్కడికి చేరుకొని చెరువు అందాలను తిలకించారు.

Read More

పుష్కరాలకు బస్సులు నడపండి

సారథిన్యూస్​, గద్వాల: త్వరలో జరుగబోతున్న తుంగభద్ర పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని.. పుష్కరఘాట్ల వద్ద మరమ్మతులు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన అలంపూర్​లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కేవలం అలంపూర్​ ఒక్కచోటే తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని.. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం పులికలు, వేణిసోంపురం, రాజోలి, తుమ్మిళ్ల, పుల్లూరు, అలంపూర్ వద్ద ఉన్న పుష్కరఘాట్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం బాగుచేయాలని కోరారు. […]

Read More
రైతులకు చేదోడువాదోడుగా సొసైటీలు

రైతులకు చేదోడు వాదోడుగా సొసైటీలు

సారథి న్యూస్, రామయంపేట: రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేస్తూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు పీఏసీఎస్​సొసైటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ ​జిల్లా నిజాంపేటలో సహకార సంఘం కొత్త భవనాన్ని ప్రారంభించారు. గతంలో సొసైటీల పనితీరు ఎవరికి తెలిసేది కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వాటికి ఒక రూపు వచ్చిందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అలాట్ చేశామని, […]

Read More

పామాయిల్ సాగును ప్రోత్సహించాలి

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. రాష్ట్రానికి కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నాయని.. ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా త్వరలోనే వస్తాయని అందువల్ల ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు లాభపడతారని పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పామాయిల్​ మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలు కూడా […]

Read More
సైకాలజిస్టులను గుర్తించండి

సైకాలజిస్టులను గుర్తించండి

సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైకాలజిస్టులను గుర్తించాలని కరీంనగర్​ సైకాలజిస్ట్​ల అసోసియేషన్​ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సుంకె రవిశంకర్​ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్తాయిలో సైకాలజీ కౌన్సిల్ ఏర్పాటుచేయలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు.

Read More