దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్బ్ అనిపించింది. పంజాబ్‌పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్చేసి ఔరా అనిపించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్ వార్నర్ 52(40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్), బెయిర్ స్టో 97(55 బంతుల్లో 7 ఫోర్లు, […]
కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్-13వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్ముంబై ఇండియన్స్.. రన్నరప్ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్‌శర్మ ఘనంగా ప్రారంభించారు.ముంబై ఇండియన్స్ జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరవ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, పాటిన్‌సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాచెన్నై సూపర్‌కింగ్ […]
దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-13 షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం బీసీసీఐ ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 19 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరగనుంది. అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభ వేడుకలు.. రాత్రి 7.30 కు మ్యాచ్ మొదలవనుంది. […]
న్యూఢిల్లీ : క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 13 వ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ ఈ నెల 6న(ఆదివారం) విడుదల కానుంది. ఈనెల 19 నుంచి నవంబర్10 మధ్య జరగబోయే ఈ మెగాటోర్నీ దుబాయ్, అబుదాబి, షార్జాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ కు చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి.
దుబాయ్: మరికొద్ది రోజుల్లో మొదలవనున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ జట్టు సభ్యుడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సీఎస్కే కీలక సభ్యుడు సురేష్ రైనా టోర్నీ నుంచి బయటకు రాగా.. ఇప్పుడు భజ్జీ కూడా నిష్క్రమించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు సీఎస్కే యాజమాన్యానికి టర్భోనేటర్ వివరించాడు.
కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియన్ప్రీమియర్లీగ్(ఐపీఎల్) తేదీ ఖరారైంది. సెప్టెంబర్19న ప్రారంభంకానుంది. అభిమాన ఆటగాళ్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్ప్రపంచ కప్సెమీ ఫైనల్ తర్వాత మైదానంలోకి దిగని మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
జోహెన్స్‌బర్గ్: చెన్నై సూపర్‌కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆలోచనాపరులు ఎక్కువ మంది ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ఫ్లెసిస్ అన్నాడు. దీనివల్లే సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో బాగా విజయవంతం అవుతుందన్నాడు. ‘చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిది. మాది కామ్ డ్రెస్సింగ్ రూమ్. దిగ్గజ కెప్టెన్ ధోనీతో పాటు చాలా మంది ఆలోచనాపరులు ఉన్నారు. వీళ్ల అనుభవం టీమ్‌కు అదనపు బలం. ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం ఉంటుంది. అవే మాకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ప్లేయర్ చాలా […]
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడడమే తన కెరీర్లో పెద్దమలుపు అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ అన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ నేర్చుకున్నా. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మారిన తర్వాత ఇన్నింగ్స్ మొదట, చివర బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. 2014లో ఆ ఫ్రాంచైజీ తరఫున 14 మ్యాచ్‌లు ఆడాను. దీంతో స్లాగ్ ఓవర్లలో […]