నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రం తీరుపై మంత్రి గంగుల మండిపాటు సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సోమవారం మంత్రి సమిక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు […]
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సామాజిక సారథి, హైదరాబాద్: పేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 264 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేకబస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా […]
యూకే టు హైదరాబాద్ ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా గుర్తింపు గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యపరీక్షలు కరోనా ఇంకా కనుమరుగు కాలే.. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే బెటర్ రెండు, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే పబ్లిక్హెల్త్డైరెక్టర్శ్రీనివాస్ రావు వెల్లడి సామాజిక సారథి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్దేశానికి రావొచ్చని, యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన […]
సామాజిక సారథి, హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పోలీస్ శాఖల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. కేబీఆర్ పార్క్ విస్తీర్ణం, పార్కుకు వచ్చే సందర్శకుల భద్రత, ఇతర చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కొంతకాలంగా పార్క్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను […]
11 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ ప్రత్యేక పర్యవేక్షణలో ట్రీట్మెంట్ సామాజిక సారథి, హైదరాబాద్: సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఒమిక్రాన్ వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. దీంతో చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన […]
సామాజిక సారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూజాహెగ్డే స్వీకరించి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూజాహెగ్డే మొక్కలు నాటిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ […]
‘మద్దతు’ దక్కేదాకా పోరాటం బీజేపీకి ఓటు వేయొద్దు టీఆర్ఎస్వైఖరి సరిగ్గా లేదు తెలంగాణ రైతులను ఆదుకోవాలి ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాల ధర్నా కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: ప్రతి పంటకు కనీస మద్దతుధర కల్పించేలా చట్టం తేవాలని కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటు వేయొద్దని, […]
జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి ఘటన సీసీ పుటేజ్‌ఆధారంగా కేసులు: సీఐ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 10మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, బుధవారం మరో 22మందిపై కేసులు నమోదు […]