సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ […]
సారథి న్యూస్, హయత్నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్నగర్డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సోమ, మంగళవారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమతంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈనెల 12,13 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని కూడవెల్లి వాగు, మోయతుమ్మెద వాగు, పిల్లివాగు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఉధృతంగా ప్రవహిస్తున్నాని, […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు వరద పోటెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దయింది. కొన్నిప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులంతా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం కలెక్టర్ జి.వీరపాండియన్ జిల్లా అధికారులను అలర్ట్ చేశారు. జిల్లాలో అధికారులు వారు పనిచేసే ప్రదేశాల్లోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో ప్రత్యేకంగా నంద్యాల, ఆత్మకూరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, రాకపోకలు, విద్యుత్ కు అంతరాయం లేకుండా, ప్రాణ, పంటనష్టం […]
వరంగల్: వరంగల్ నగరాన్ని వర్షం వీడడం లేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి హన్మకొండలో భారీవర్షం కురిసింది. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. భారీవర్షాలతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముంపు ప్రాంతాల కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
సారథి న్యూస్, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ర్టంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, జలవనరులు నీటిమయమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు ఐదువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ములుగు జిల్లాలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. నదికి సమీపంలోని ఏటూరునాగరం గ్రామంలోని లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని తరలించారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో […]