Breaking News

HARITHAHARAM

భయపెడుతున్న వానరాలు

సారథి న్యూస్,రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లమీద కోతులు గుంపులుగుంపులుగా చేరి భయపెడుతున్నాయి. ఇండ్లలోకి చేరి ఆహారపదార్థాలను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని కోతులను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.

Read More

ప్రజాశ్రేయస్సే లక్ష్యం

సారథి న్యూస్, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమ నిరంతరం పాటుపడుతున్నారని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలంలోని పలు గ్రామల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బీబీపేట, ఫతేపూర్​ తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కల్హేర్ మండలంలో పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More

మొక్కలు నాటడం మన బాధ్యత

సారథిన్యూస్​, ఖమ్మం: మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని ఖమ్మం పోలీస్​ కమిషనర్​ తఫ్సీర్​ ఇక్బాల్​ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కమిషనర్​ క్యాంప్​ కార్యలయంలో ఇక్చాల్​ కుటుంబసభ్యలు ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాక వాటిని బతికించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్ తనయుడు తైముర్ ఇక్బాల్ , కమిషనర్ సతీమణి జెబాఖానమ్ పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

కొనసాగుతున్న హరితహారం

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోవిడత హరితహారంలో భాగంగా కరీంనగర్​ జిల్లా రామడుగు మండల వ్యవసాయశాఖ మంగళవారం ‘బండ్ బ్లాక్ ప్లాంటేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెదిర గ్రామశివారులో రైతుల పొలాల గట్ల వెంబడి 200 టేకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, చొప్పదండి డివిజన్ ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, ఎంపీడీవో సతీశ్​రావు, ఏపీవో చంద్రశేఖర్​, ఏఈవో సంపత్, వీడీసీ చైర్మన్​ శేఖర్, […]

Read More
ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ కమాండెంట్ శ్రీహరిఓం ఖరే ఆధ్వర్యంలో ఆదివారం వెంకటాపురం మండలంలోని మంగవాయ, లక్మిపురం, పాత్రపురం గ్రామాల్లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సీఆర్​పీఎఫ్​ఆఫీసర్ కమాండింగ్ ఎస్సై సీతారాం సింగ్, సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి, సీఆర్​పీఎఫ్​ఎస్సై అలెగ్జాండర్ డేవిడ్, ఎస్సై రాంప్రసాద్ పాల్ మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. సర్పంచ్ కృష్ణార్జునరావు, ఉపసర్పంచ్ మల్లికార్జున రావు, టీచర్ పాండా […]

Read More
మొక్కలు ఎదిగితేనే సార్థకత

మొక్కలు ఎదిగితేనే సార్థకత

సారథి న్యూస్, మెదక్: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, వాటిని బతికిస్తేనే హరితహారం కార్యక్రమానికి సార్థకత ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూలు ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీళ్లుపోశారు. స్కూలు ఆవరణలో వెయ్యి మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మొక్కలను దత్తత ఇచ్చి కాపాడే […]

Read More

హరితహారం.. మహాయజ్ఞం

సారథిన్యూస్/ చొప్పదండి/ హుస్నాబాద్: హరితహారం ఓ మహాయజ్ఞమని ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలను నాటడాన్ని తమవిధిగా భావించాలని పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితెల సతీశ్​కుమార్​ తమ నియోజవర్గానికి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్​ను కోరారు. దీనికి […]

Read More
భవిష్యత్ ​కోసమే మొక్కలు

భవిష్యత్ ​కోసమే మొక్కలు

సారథి న్యూస్, మెదక్: భావితరాల భవిష్యత్​ బాగుండాలంటే తప్పకుండా మొక్కలు నాటాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం హవేళి ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో కలెక్టర్ ఎం.ధర్మారెడ్డితో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకు అనుగుణంగా సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరుమొక్కలు నాటి రక్షించాలన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. కరోనా […]

Read More