సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా నిజాంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. కమలా హారిస్ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్ 1నాటికి వ్యాక్సిన్ […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కోరుకుంటున్నాను. అయితే ఈ పదవికి కేవలం తన కూతురు ఇవాంక ట్రంప్ మాత్రమే అర్హురాలని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తొలిసారిగా న్యూహాంప్షైర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. […]
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్‌లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున […]
వాషింగ్టన్: కమలా హ్యారిస్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యరీస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థికి ఎంపికైనా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమెకు అభినందనలు తెలిపారు. ‘ కమలా హ్యారిస్ ఎంపిక అన్ని వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా నల్లజాతి, దక్షిణాసియా మహిళలకు గర్వకారణమని చెప్పుకోవచ్చు’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫోటోను షేర్ చేశారు.
వాషింగ్టన్: నవంబర్ 3 నాటికి కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను అమెరికానే తయారు చేస్తుందని ఆయన చెప్పారు. ఓ రేడియో కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు అమెరికా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో సత్ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 3నే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో […]
అమరావతి : ఏపీ లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. […]
అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్‌హరిచందన్ పేరుతో ప్రకటన జారీచేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్) విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌లీవ్ పిటిషన్‌లో వచ్చే […]