Breaking News

DUBBAKA

రైతు ఉసురు ముట్టక తప్పదు

రైతు ఉసురు ముట్టక తప్పదు

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయం రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్ రావు సామాజికసారథి, మెదక్‌: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాలోని హవేళి ఘనపూర్‌ మండలం బోగడ భూపతిపూర్‌ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ […]

Read More
సమ్మె విరమణ... విధుల్లో చేరిక

సమ్మె విరమణ… విధుల్లో చేరిక

విధుల్లో చేరిన గణపతి కార్మికులు సమ్మె విరమణ, విధుల్లో చేరిక సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: నూతన వేతన సవరణ చేయాలంటూ గత 34రోజులుగా గణపతి చక్కెర పరిశ్రమ కార్మికులు కార్మికులు సమ్మె చేస్తుంన్రు. కార్మికుల సమ్మె న్యాయబద్దంగా ఉండడంతో కార్మికుల డిమాండ్లను అంగీకరిస్తూ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సమక్షంలో యాజమాన్యానికి, కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది. దుబ్బాక ఎమ్మెల్యే, చక్కెర పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు నేతృత్వంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ […]

Read More
సమ్మెను విచ్ఛిన్నం..చేయాలని చూస్తోంది

సమ్మెను విచ్ఛిన్నం..చేయాలని చూస్తోంది

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: గణపతి చక్కెర పరిశ్రమ యాజమాన్యం కార్మికుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు అన్నారు. నూతన వేతన సవరణ కోసం గణపతి పరిశ్రమ రెగ్యులర్ ఉద్యోగులు గత 23 రోజులుగా పరిశ్రమ ఎదుట సమ్మె నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే, చెరుకు క్రషింగ్ ప్రారంభం అయ్యే సమయం దగ్గర పడటంతో సీజనల్ కార్మికులు […]

Read More
దళితులపై బీజేపీ చిన్నచూపు

‘దళితులపై బీజేపీ చిన్నచూపు’

సారథి,పెద్దశంకరంపేట: దళితులను బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ దళిత సర్పంచ్ మహేశ్వరి నరేష్​ను ఎమ్మెల్యే రఘునందన్ రావు అవమానించడం, దళితుల పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపు, బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఎంపీపీ, సర్పంచ్​కు చెప్పకుండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Read More
‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

సారథి న్యూస్, రామాయంపేట: ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీని ఎడమకాలు చెప్పుతో సమానమని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించినట్లేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఫామ్ హౌస్ ను వదలని.. ప్రగతి భవన్ ను దాటని ముఖ్యమంత్రి రాజీనామా చేసి చేతనైనవారికి పాలన వ్యవస్థను అప్పగించాలని హితవుపలికారు. సోమవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆ […]

Read More
4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బాగాంధీ(కేజీబీవీ) బాలికల స్కూళ్ల భవనాల నిర్మాణాలకు రూ.14 కోట్లు మంజూరైనట్లు మంత్రి టి.హరీశ్​ రావు తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలను మంజూరు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుట, రాయ్ పోల్ మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం, జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా బాలికల […]

Read More
రౌండ్ రౌండ్ కు టెన్షన్​

రౌండ్ రౌండ్ కు టెన్షన్​

టీఆర్ఎస్, బీజేపీ మధ్య లీడ్​ దోబూచులాట కనీసం పోటీ ఇవ్వని కాంగ్రెస్​ సారథి న్యూస్, దుబ్బాక: గులాబీ కంచుకోటలో కమలం వికసించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజారిటీతో అనూహ్య విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలుకుని 25 రౌండ్లలో ప్రతి రౌండ్ నువ్వా.. నేనా? అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్ నరాలు తెగే ఉత్కంఠతను తలపించింది. పలు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అంతిమ […]

Read More
రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్​రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్​బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్​జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక […]

Read More