Breaking News

Day: July 29, 2021

‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించాలే’

‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించాలే’

సారథి, చొప్పదండి: సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరమని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సంబోజీ సునీల్, నెల్లి సంతోష్, బండారి అఖిల్ నాయకులు పాల్గొన్నారు.

Read More
సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ ​సంజయ్ కుమార్, జడ్పీ చైర్​పర్సన్​ దావా వసంత కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబసభ్యులకు రూ.ఐదులక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. అనంతరం […]

Read More
రాజన్న హుండీ గలగల

రాజన్న హుండీ గలగల

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్​చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.

Read More
ఇసుక రవాణాపై కఠినంగా ఉండాలే

ఇసుక రవాణాపై కఠినంగా ఉండాలే

సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ జి.రవి సూచించారు. అనుమతి లేకుండా ఇసుకను డంప్ చేసే స్థలాలను గుర్తించి భూ యజమానులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. వాహనాలకు పెనాల్టీలు మాత్రమే విధించకుండా సీజ్ చేయాలన్నారు. కలెక్టరేట్​నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆయన జూమ్ మీటింగ్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక రవాణాపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అక్రమరవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించి […]

Read More
ప్రగతిభవన్ ముట్టడి.. బీజేవైఎం నేతల అరెస్ట్​

ప్రగతిభవన్ ముట్టడి.. బీజేవైఎం నేతల అరెస్ట్​

సారథి, రామడుగు: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న భారతీయ జనతా యువమోర్చా మండల నాయకులను రామడుగు ఎస్సై నరేష్ గురువారం అరెస్ట్​చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్​అయిన వారిలో యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండలాధ్యక్షుడు దురిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కార్యదర్శి బుర్ర […]

Read More
దళితులపై బీజేపీ చిన్నచూపు

‘దళితులపై బీజేపీ చిన్నచూపు’

సారథి,పెద్దశంకరంపేట: దళితులను బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ దళిత సర్పంచ్ మహేశ్వరి నరేష్​ను ఎమ్మెల్యే రఘునందన్ రావు అవమానించడం, దళితుల పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపు, బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఎంపీపీ, సర్పంచ్​కు చెప్పకుండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Read More
ఉరకలేస్తున్న కృష్ణమ్మ

ఉరకలేస్తున్న కృష్ణమ్మ

గంట గంటకు పోటెత్తుతున్న వరద 4.75 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జూరాల 45 గేట్ల ఎత్తివేత సారథి, జూరాల(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానదికి వరద ప్రవాహం గంట గంటకు ఉధృతంగా పెరుగుతోంది. దిగువన శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. జూరాల ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను ముంచెత్తింది. ఎగువ నుంచి నీటి విడుదల పెరిగితే ఆలయాన్ని వరద తాకనుంది. ఈ […]

Read More
కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

సారథి, బిజినేపల్లి: ఉపాధిహామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలను కులాల వారీగా విభజించి పనులు చేయించడం సరికాదని, సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్)​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పనుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​నిధులను ఖర్చుచేయడం సరికాదన్నారు. గురువారం బిజినేపల్లి తహసీల్దార్​ ఆఫీసు ఎదుట కేవీపీఎస్ ​ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005లో నాటి ప్రభుత్వం కులాలు, మతాలకతీతంగా […]

Read More