సారథి న్యూస్, రామడుగు: ప్రస్తుతపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ఎమర్జెన్సీని ప్రకటించాలని కరీంనగర్ జిల్లా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మచ్చ రమేశ్, ఏగుర్ల మల్లేశ్, వేముల మల్లేశం, పారునంది మొండయ్య,ఉమ్మెంతుల రాజిరెడ్డి,రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, చిరంజీవులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కళావతి, బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి బీరన్న, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి భూ నిర్వాసితులకు 12 ఏండ్లయిన పరిహారం ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం నీటిపారుదల శాఖ సెక్రటరీ, సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. గౌరవెల్లి ప్రాజెక్టు రీ డిజైన్‌లో భాగంగా 1.4 నుంచి నుంచి 8.2 టీఎంసీల సమర్థ్యాన్ని పెంచడంతో ప్రాజెక్టు కింద రెండవసారి నిర్వాసితులు భూములను కోల్పోయారన్నారు. భూ నిర్వాసితులు ఏండ్ల తరబడి నష్టపరిహారం కోసం మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే, […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లక్ష్మీనగర్‌లో 2013లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా ఉందని.. దీంతో రూ. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆదివారం సీపీఐ నేతలు రామగుండంలో పర్యటించి ప్రభుత్వం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కనకరాజ్ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికే షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారని ఆరోపించారు. ఈ దుకాణ సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. సకాలంలో టెస్టులు చేసి కరోనా బాధితులను క్వారంటైన్ చేసి ఉంటే కరోనా అదుపులోకి వచ్చిఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ కరోనా ఉధృతిని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పేదకుటుంబానికి రూ.7500 […]
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్మున్సిపాలిటీలో వీధికుక్కలు కాలనీవాసులు, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని, వాటిని వెంటనే తరలించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ బుధవారం మున్సిపల్ అధికారులను కోరారు. పందులు, కుక్కలను తరలించాలని గతంలో తీర్మానించినా అది కాగితాలకే పరిమితమైందన్నారు. సీజనల్ వ్యాధుల విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి వార్డులో దోమల మందు పిచికారీ చేయాలని కోరారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ పట్టించుకోవడంలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. 14వ వార్డులో పర్మిషన్‌లేకుండా నిర్మిస్తున్న ప్రహారీని గురువారం సీపీఐ బృందం పరిశీలించింది. రోడ్డుకు సెట్ బ్యాక్ ఇస్తూ ఇండ్లను కట్టుకోవాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు. పరిశీలించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, సీపీఐ నాయకులు జాగీర్ సత్యనారాయణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల […]