Breaking News

COLLECTOR

రామడుగు శిల్పకళ అద్భుతం

సారథిన్యూస్, రామడుగు: రామడుగులో అద్భుతమైన శిల్పసంపద ఉన్నదని కరీంనగర్​ అదనపు కలెక్టర్​ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రామడుగు మండల కేంద్రాన్ని సందర్శించారు. రామడుగుకు చెందిన శిల్పులు దేవతా విగ్రహాలు చేయడంలో నిష్ణాతులని కొనియాడారు. అనంతరం 200 ఏండ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడికోట ను సందర్శించారు. కలెక్టర్ వెంట సర్పంచ్​ పంజాల ప్రమీల, ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్​ కోమల్​రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు తదితరులు ఉన్నారు.

Read More
హరితవనం.. శభాష్​

హరితవనం.. శభాష్​

సారథి న్యూస్​, వెల్దండ: నాగర్ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ గురువారం శ్రీశైలం– హైదరాబాద్​ హైవేపై ఉన్న వెల్దండ తహసీల్దార్​ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్​ సైదులుతో మాట్లాడారు. ఆఫీసు చుట్టూ పచ్చదనం వెల్లివెరిసేలా నాటించిన మొక్కలను చూసి కలెక్టర్​ ముగ్ధులయ్యారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణ పచ్చదనంతో పరిఢవిల్లడం ఎంతో అభినందనీయమని అభినందించారు. కార్యాలయ ఆవరణలో రాళ్లగుట్టపై ఖాళీగా ఉన్న స్థలంలో పూలతీగ మొక్కలను పెంచాలని కలెక్టర్ […]

Read More
12 మంది సబ్‌ కలెక్టర్లుగా నియామకం

12 మంది సబ్‌ కలెక్టర్లుగా నియామకం

అమరావతి: ప్రొబేషనర్(2018 బ్యాచ్) ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్‌లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్‌లుగా నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్‌లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సబ్‌ కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు పృథ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప (కడప), ప్రతిష్ఠ […]

Read More

కలెక్టర్​కు రాఖీకట్టిన జెడ్పీచైర్​పర్సన్​

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మన్​కు జెడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్​ ఆమెకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్​ సూచించారు.

Read More

దోపిడీకి తెరలేపారు

సారథిన్యూస్​, నిజామాబాద్​: కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదనుగా చేసుకొని నిజామాబాద్​ జిల్లాలో మెడికల్​ దుకాణాలు దోపిడీ పర్వానికి తెరలేపాయి. కరోనా మందులను ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా చోట్ల కృత్రిమ కొరత సృష్టించి పేదప్రజలను నిలువునా ముంచుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ఉన్న బంగారం, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాగా ఈ దోపిడీ దందాపై మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి స్పందించారు. జిల్లాలోని మెడికల్​ షాపులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్​ […]

Read More
హోటల్​కు భారీ జరిమాన

హోటల్​ తనిఖీ.. భారీ జరిమాన

సారథిన్యూస్​, కొత్తగూడెం: కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించని ఓ హోటల్​కు భారీ జరిమాన విధించిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం కలెక్టర్​ ఎంవీ రెడ్డి జిలా కేంద్రంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ‘గుడ్​మార్నింగ్​’ అనే హోటల్​లో సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించకుండా తినుబండారాలు సప్లై చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్​ హోటల్​ యజమానికి రూ. 25వేలు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More
ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

సారథి న్యూస్​, మహబూబ్ నగర్: నూతనంగా నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లు నిజాయితీగా పనిచేసి పేదలకు అండగా నిలవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఉద్యోగాన్ని కూడా తమ సొంత పనిలా భావించి కష్టపడి పనిచేస్తే రాణిస్తారని హితబోధ చేశారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జడ్పీ మీటింగ్​హాల్​లో నూతన డిప్యూటీ తహసీల్దార్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖకు గతం నుంచి మంచిపేరు ఉందన్నారు. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్​లాగ్​ ద్వారా భర్తీచేసిన […]

Read More

ఆదిలాబాద్​లో అలజడి

సారథి న్యూస్ ఆదిలాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్​లో ప్రస్తుతం కరోనా కేసులు పేరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో కలెక్టర్​ ఓఎస్డీ, కలెక్టర్​ క్యాంప్​ క్లర్క్​లకు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి అందరికీ కరోనా  నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శుక్రవారం వీరంతా శాంపిల్స్ ఇచ్చారు. కాగా ఇటీవల కలెక్టర్​రేట్​కు వచ్చినవారిలో […]

Read More