సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని చంద్రశేఖర్ నగర్లో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చందర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు.
సారథి న్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూచట్టంతో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అధికారుల అవినీతికి చెక్ పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆదివారం రామగుండం, పాలకుర్తి, అంతర్గాం నుంచి గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే చందర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని ప్రారంభించారు. ర్యాలీలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, […]
సారథిన్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకం మహత్తరమైనదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పేదప్రజలు సొంతింట్లో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు పాతపెల్లి […]
సారథిన్యూస్, గోదావరిఖని/రామగుండం: గోదావరిఖని నియోజకవర్గానికి గీట్ల జనార్దన్‌రెడ్డి సేవలు మరువలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. సాహితీవేత్తగా, రాజకీయనాయకుడిగా గీట్ల ఈ ప్రాంతానికి ఎన్నోసేవలు చేశారని కొనియాడారు. శుక్రవారం ఆయన 82వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలోని గీట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయన సేవలకు గుర్తుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10, 48వ డివిజన్లలో హరితహారంలో […]
సారథిన్యూస్, రామగుండం: రజకుల సమస్యలను పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 9వ డివిజన్లో దోబీఘాట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులవృత్తులను నమ్ముకుని జీవించే రజకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. రూ. 5 లక్షల నిధులతో దోభీఘాట్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం 8వ డివిజన్లోని తెలంగాణ అడ్వంచర్ అక్వాడ్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ […]