Breaking News

రజకుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథిన్యూస్​, రామగుండం: రజకుల సమస్యలను పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 9వ డివిజన్​లో దోబీఘాట్​ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులవృత్తులను నమ్ముకుని జీవించే రజకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. రూ. 5 లక్షల నిధులతో దోభీఘాట్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం 8వ డివిజన్​లోని తెలంగాణ అడ్వంచర్ అక్వాడ్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, నాయకులు వెగోళపు శ్రీనివాస్ గౌడ్, కోరకోప్పుల రవి, గోలివాడ ప్రసన్న, చంద్రకళ, కేశవగౌడ్, గనవేన సంపత్, తోకల రమేశ్​​, ఇరుగురాళ్ల శ్రావణ్​, అబ్బాస్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.