Breaking News

GODAVARI

న్యాయం కోసం వారి తపన మరువలేనిది

న్యాయం కోసం వారి తపన మరువలేనిది

సారథి, వేములవాడ: స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు న్యాయవాదుల పాత్ర మరువలేనిదని గోదావరి అర్బన్ మల్టీ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ వేములవాడ శాఖ సీఈవో, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాచమనేని శ్రీనివాసరావు కొనియాడారు. శనివారం అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, భూమేష్, రేగుల దేవేందర్, గోపి, కిషోర్ రావు, అనిల్, గుడిసె సదానందం, నక్క దివాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. […]

Read More
వంతెనకాదు.. కాలుష్యపు నురగ

కాలిబాట కాదు.. కాలుష్య నురగ

సారథిన్యూస్​, రామగుండం: పరవళ్లు తొక్కుతూ, పంట చేలను తడుపుతూ, రైతన్నలను పరవశింపజేసే గోదావరి తల్లికి కాలుష్యం కాటు వేసింది. ప్రస్తుతం రామగుండం పారిశ్రామిక వాడ సమీపంలోని గోదావరి నది నీటిమధ్యలో ఓ వింత నురగ ప్రవహిస్తోంది. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీరు నదిలోకి వదలడం వల్ల ఈ నురుగ వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం ఈ కాలుష్య నురుగను గమనించిన రామగుండం సీపీఐ కార్యదర్శి మద్దెల దినేశ్​ కాలుష్య నియంత్రణ అధికారికి తెలిపారు. రంగంలోకి దిగిన […]

Read More
గోదావరి మహోగ్రరూపం

గోదావరి మహోగ్రరూపం

భద్రాచలం: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే చివరిదైన మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. 2014, సెప్టెంబర్‌ 8న భద్రాచలం […]

Read More
చుక్క నీటిని వదులుకునేది లేదు

చుక్క నీటిని వదులుకునేది లేదు

సారథి న్యూస్,​ హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి నదుల్లో మన హక్కు నీటివాటాను కాపాడుకుని తీరాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని కేసీఆర్​ స్పష్టంచేశారు. ఎంతటి పోరాటానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి యూపీ సింగ్ […]

Read More

రాజగృహపై దాడి హేయం

గోదావరిఖని: ముంబైలోని అంబేద్కర్​ ఇల్లు( రాజగృహ) పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. నిందితులను గుర్తించడంలో మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించకపోతే ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో అన్ని దళితసంఘాలను కలుపుకుపోయి దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్​పీఎస్​) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​, వీహెచ్​పీఎస్​ నాయకులు మంతని సామిల్ […]

Read More
దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇలా ఉండగా, పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా […]

Read More

జనార్దన్​రెడ్డి సేవలు మరువలేనివి

సారథిన్యూస్​, గోదావరిఖని/రామగుండం: గోదావరిఖని నియోజకవర్గానికి గీట్ల జనార్దన్​రెడ్డి సేవలు మరువలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. సాహితీవేత్తగా, రాజకీయనాయకుడిగా గీట్ల ఈ ప్రాంతానికి ఎన్నోసేవలు చేశారని కొనియాడారు. శుక్రవారం ఆయన 82వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలోని గీట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయన సేవలకు గుర్తుగా మంత్రి కొప్పుల ఈశ్వర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 10, 48వ డివిజన్లలో హరితహారంలో […]

Read More
చెవిలో పూలతో వినూత్న నిరసన

చెవిలో పూలతో వినూత్న నిరసన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం షానగర్ వరద కాల్వపై మోతె కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడాది గడిచినా ఇప్పటికి పనులు ప్రారంభించకపోవడంతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్​మేడిపల్లి సత్యం, ఆ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నరీతిలో చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఎంతో అట్టహాసంగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. […]

Read More