Breaking News

BJP

ఇంటింటికి తిరిగి కేంద్రప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్న బీజేపీ నేతలు

జోరుగా గడపగడపకు బీజేపీ

సారథి న్యూస్, రామాయంపేట: గడపగడపకు బీజేపీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శనివారం బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ సందేశాన్ని ఇంటింటికీ వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో నెంటురి రమేశ్​ గౌడ్, నాతి రమేశ్​ గౌడ్, శ్రీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Read More

పార్టీకాదు..అభివృద్ధే ముఖ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: అభివృద్ధి కోసం అవసరమైతే రాజకీయాలను పక్కన పెడతానని కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్​ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. వానాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు శ్రీనివాస్, వేణు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ […]

Read More
BJP

మోడీ పాలన భేష్​

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలంలో ఆయన మోదీ ఏడాది పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్​ ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప […]

Read More
BJP

కేంద్రపథకాలపై ప్రచారం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రపథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాగర్​కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి దిలీప్ ఆచారి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు అందిస్తున్నా.. వాటిని సద్వనియోగం చేసుకోవడంతో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆచారి ఆరోపించారు. సీఎం కేసీఆర్​ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ కార్యదర్శి నారాయణ […]

Read More

బీజేపీ మెదక్ జిల్లాకు కొత్త సారథి

సారథి న్యూస్, మెదక్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మెదక్ జిల్లాకు గడ్డం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డ శ్రీనివాస్ పార్టీలో కార్యకర్తస్థాయి నుంచి జిల్లా అధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు. గతంలో ఉమ్మడి మెదక్ మండలాధ్యక్షుడిగా మూడుసార్లు, మెదక్ ఉమ్మడి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. పార్టీకి అందించిన సేవలకు […]

Read More

శ్రామిక్‌ రైళ్లు ‘డెత్‌ పార్లర్లు’

కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అధిర్​ రంజన్‌ చౌధరి న్యూఢిల్లీ: వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, శ్రామిక్‌ రైళ్లు ‘డెత్‌ పార్లర్లు’గా మారాయని కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అధిర్​​‌ రంజన్‌ చౌధరి విమర్శించారు. లాక్‌డౌన్‌ చాలా రోజుల ముందే పెట్టాల్సిందని, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వరకు ఆగి అప్పుడు పెట్టారని బీజేపీపై విమర్శలు చేశారు. మన దేశంలో జనవరిలోనే కరోనా కేసు నమోదైందని, అప్పుడే ఇంటర్​నేషనల్​‌ ఫ్లైట్లు బంద్‌ పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత […]

Read More

నెలరోజుల్లో నీళ్లిస్తే గుండు గీసుకుంటం

బీజేపీ నేత విజయ పాల్ రెడ్డి సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ నీళ్లు తీసుకొస్తే గుండు గీసుకుంటామని బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి విజయ పాల్ రెడ్డి సవాల్​ విసిరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును పూర్తిచేయకుండా ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సమావేశంలో అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షుడు వీరాచారి, హుస్నాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, శంకర్ […]

Read More

రుణమాఫీ చేయండి

బీజేపీ నాయకుల డిమాండ్​ సారథి న్యూస్, హుస్నాబాద్: రైతుబంధు నిబంధనలు తొలగించి రూ.లక్ష పంట రుణమాఫీ చేయాలని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలని, లేనిపక్షంలో రైతుబంధు ఇవ్వబోమనడం సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నునావత్ మోహన్, రాజ్ కుమార్, కృష్ణ, సంపత్, వంశీ తదితరులు […]

Read More