సామాజిక సారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూజాహెగ్డే స్వీకరించి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూజాహెగ్డే మొక్కలు నాటిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ […]
కర్ణాటక సినీ పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తున్నది. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి డ్రగ్స్‌కేసులో అరెస్టయ్యారు. అయితే వారు సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. మరోవైపు సంజనా, రాగిణి ఎవరిపేరు బయటపెడతారో అని సర్వత్రా టెన్షన్ నెలకొన్నది. అయితే ఇటీవల ఈ కేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్ అనుశ్రీని పోలీసులు విచారణకు పిలించారు. దీంతో అనుశ్రీ డ్రగ్స్‌కేసులో ఇరుక్కున్నదంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అనుశ్రీ ఇన్‌స్టాలో […]
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం సరికాదని అనూష్క వ్యాఖ్యానించారు. ఇంతకూ గవాస్కర్ తన కామెంట్రీలో ఏమన్నారు.. ‘ఏ క్రికెటర్ అయినా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగవుతాడు. కానీ కోహ్లీ మాత్రం లాక్డౌన్ సమయంలో ఆయన భార్యతోనే ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. […]
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ పాయల్ ఘోష్ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్ […]
‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్‌లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు. శ్రావణికి కొంతకాలం […]
గంజాయి మొక్క ఎంతో గొప్ప ఔషధమట.. తులసిమొక్కలాగే ఇందులోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయట. గంజాయి వాడకాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేయాలట.. ఈ మాటలన్నది ఎవరో ఆషామాషి వ్యక్తి కాదండి.. ప్రముఖ కన్నడ సినీనటి నివేదిత. దీంతో నెట్‌జన్లు నివేదితపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ ఫిగర్వి అయ్యిఉండి ఇలాంటి మాటలు చెప్పడానికి సిగ్గుగా లేదా? అని కామెంట్ చేస్తున్నారు. ఓ వైపు సినీ పరిశ్రమకు చెందినవారంతా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్న ప్రస్తుత తరుణంలో ఈమె వ్యాఖ్యలు […]
కర్ణాటకలో మొదలైన డ్రగ్స్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది కి డ్రగ్స్ రాకేట్తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె […]
సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి మద్దతు పెరుగుతున్నది. సుశాంత్ ఘటన అనంతరం వెల్లువెత్తిన ఆరోపణలతో రియా చక్రవర్తి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు సమాచారం. తొలుత ఆమె వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉండటంతో నెట్‌జన్లు ఆమెపై ట్రోలింగ్ మెదలుపెట్టారు. దీనికి తోడు జాతీయమీడియా సైతం రియాపై అనేక కథనాలు వెలువరించింది. సుశాంత్ అభిమానులు ఇప్పటికీ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు రియాకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల […]