Breaking News

TELANGANA

తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం జగన్​ డిక్లరేషన్​ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ప్రకటించడం.. దాన్ని బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలో టీడీపీ, బీజేపీ, హిందూసంఘాలు తిరుపతిలో మోహరించాయి. ఓ వైపున పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్​ చేశారు. […]

Read More
పక్కాగా ఆస్తుల వివరాలు నమోదు

పక్కాగా ఆస్తుల వివరాలు నమోదు

భూరికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలి ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్​ సమీక్ష సారథి న్యూస్, హైదారాబాద్: గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదుకాని ఆస్తుల […]

Read More

వ్యవసాయ బిల్లు ఆమోదంపై హర్షం

సారథి న్యూస్, రామడుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు శనివారం పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల రామడుగు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో బీజేపీ నాయకులు నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్ట రవీందర్, అంజిబాబు, రాజేంద్రచారి, రాజు, సత్యనారాయణ, భరత్, శ్రీకాంత్, వెంకటేశ్​, గాలిపల్లి రాజు, శ్రీనివాస చారి, పోచమల్లు, మల్లేశం పాల్గొన్నారు.

Read More

కరంటోళ్ల నిర్లక్ష్యం.. ఒకరు బలి

సారథి న్యూస్, కంగ్టి(నారాయణఖేడ్): విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మెదక్​ జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన హైమద్ షేక్(45) విద్యుత్ శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం విద్యుత్​శాఖ విధుల్లో భాగంగా తడ్కల్​లోని ఓ పొలంలో విద్యుత్​ వైర్లను బిగిస్తున్నాడు. కానీ విద్యుత్​ సిబ్బంది, అధికారుల సమన్వయ లోపంతో ఆ సమయంలో విద్యుత్​ సిబ్బంది కరెంట్​ వేశారు. దీంతో హైమద్​ విద్యుత్​ షాక్​తో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ అధికారుల […]

Read More

సేంద్రియం.. లాభదాయం

సారథి న్యూస్, రామడుగు: రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలంటే సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని రామడుగు ఎంపీపీ కె.కవిత సూచించారు. మంగళవారం రామడుగు మండలం శనగర్ లో ఆత్మ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరి, పత్తిలో చీడపీడల నివారణపై పలువరు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, జడ్ఆర్ఎస్ఎస్ మెంబర్​ గర్రెపల్లి కర్ణాకర్, వీడీసీ చైర్మన్​ కర్ణాకర్, ఉపసర్పంచ్ వెంకట్ నర్సయ్య, ఆత్మ […]

Read More

సులభ్​ కాంప్లెక్స్​ కోసం వినతి

సారథిన్యూస్, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో సులభ్​ కాంప్లెక్స్​ నిర్మించాలని గ్రామ యువకులు.. కార్యదర్శి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులభ్​ కాంప్లెక్స్​ లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి రామడుగు మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అనుపురం పరుశరాం, పురేళ్ల శ్రీకాంత్, మామిడి అంజి, ఉత్తేమ్, మహేశ్​ తదితరులు ఉన్నారు.

Read More
గ్రాడ్యుయేట్​ఎన్నికల ఓటరు నమోదు షురూ

గ్రాడ్యుయేట్ ​ఎన్నికల ఓటరు నమోదు షురూ

సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఓటరు నమోదుకు నోటీస్ జారీచేసింది. నవంబర్ 6వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనుంది. డిసెంబర్ 1న ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 2021 జనవరి 12వ తేదీ […]

Read More

వలపువల.. బుట్టలోపడ్డారో ఇక​అంతే..

ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా సోషల్​మీడియాలో ఆమె ధనవంతులను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వారితో మత్తెక్కించేలా మాట్లాడుతుంది. అనంతరం వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా లొంగదీసుకుంటుంది. అనంతరం అక్కడ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్​మీడియాలో పెడతానంటూ బెదిరించి లక్షల్లో […]

Read More