Breaking News

TELANGANA

మక్కపంటకు విరామమే మంచిది

మక్కపంటకు విరామమే మంచిది

వ్యవసాయ శాఖ.. ఇక డైనమిక్ డిపార్ట్​మెంట్ తెలంగాణ ఏం తింటున్నదో అవే పంటలు సాగుచేయించాలి వచ్చే ఏడాది నుంచి రైతులకు ‘అగ్రికల్చర్ కార్డులు’ వ్యవసాయ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీచేయండి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదల, సమన్వయంతో పనిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ ఇకనుంచి సాదాసీదా డిపార్ట్​మెంట్​కాదని, […]

Read More
కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్​ఇకలేరు

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్ ​ఇకలేరు

​అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్​ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్‌ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]

Read More
మొక్కజొన్న తోటలో..

మొక్కజొన్న తోటలో..

సారథి న్యూస్​, హైదరాబాద్​: మొక్కజొన్న పంట, దాని ఉత్పత్తి, మద్దతు ధరల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ నేతలకు స్పష్టత కొరవడిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ సమక్షంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్లమెంట్​లో మరో రకమైన వాదన వినిపించారు. ‘దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే అవసరం. కానీ […]

Read More
రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్​ 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సమావేశాల ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. సభ లోపల శానిటేషన్ చేయాలని సూచించారు. అలాగే సమావేశాల బందోబస్తుపై డీజీపీ, పోలీస్​ కమిషనర్​తో స్పీకర్ ​పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అలాగే కరోనా మహమ్మారి […]

Read More

రేప్​చేసి వీడియో తీశారు..

ఉత్తర్​ప్రదేశ్​లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్​ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్​ వీడియో తీశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీకి చెందిన ఓ యువతి అదే పట్టణంలో పాల్​టెక్నిక్​ చదువుతున్నది. కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని సదరు యువకుడు కిడ్నాప్​ చేసి తీసుకెళ్లాడు. ఆనంతరం ఓ ఇంట్లోకి […]

Read More

దూసుకొస్తున్న వాయుగుండం.. రెండ్రోజులు వర్షాలు

సారథిన్యూస్​, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కోస్తాఆంధ్ర వైపు దూసుకొస్తున్నది. అయితే మరో 12 గంటల్లో అతి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ […]

Read More

నేపాల్​ ముఠా అరెస్ట్​.. ఎలా దొరికారంటే

కొంతకాలంగా హైదరాబాద్​తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తున్న ముఠా సైబారాబాద్​ పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో వీరిని అరెస్ట్​ చేసినట్టు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 6న ఈ ముఠా హైదరాబాద్ రాయదుర్గంలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. మధుసూదన్​రెడ్డి అనే కాంట్రాక్టర్​ ఇంట్లో పనిమనుషులుగా చేరిన ముఠా సభ్యులు వారి కుటుంబానికి భోజనంలో మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. […]

Read More
తెలంగాణలో 1,021 కరోనా కేసులు

తెలంగాణలో 1,021 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 30,210 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారినుంచి తాజాగా 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల […]

Read More