Breaking News

RAMAGUNDAM

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్​ఇకలేరు

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్ ​ఇకలేరు

​అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్​ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్‌ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]

Read More
కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో అమరుల ఆత్మబలిదానాలు, ఉద్యమనేతల అలుపెరగని పోరాటంతో పాటు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అన్నివర్గాల సంక్షేమంతో పాటు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మత్స్యకార సహకార సంఘాల సమావేశంలో మాట్లాడారు. సీఎం గొప్ప ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు […]

Read More
కరోనా పీడ తొలగిపోవాలి

కరోనా పీడ తొలగిపోవాలి

సారథి న్యూస్, రామగుండం: నియోజకవర్గంలో ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు,కార్మికులు, కర్షకులు, అన్నివర్గాల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనిఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవిని వేడుకున్నారు. శుక్రవారం క్యాంపు ఆఫీసులో చండీయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థమే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టానని ఎమ్మెల్యే అన్నారు. కరోనా నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More
ఇంటింటా బతుకమ్మ జరుపుకోవాలి

ఇంటింటా సంతోషంగా నిండాలని..

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్‌ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల […]

Read More
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి

సారథి న్యూస్, ధర్మారం(రామగుండం): అన్ని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తామని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ బహూకరించి నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిని వీలైనంత వరకు వెడల్పు చేసి అత్యాధునిక వీధిదీపాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4,82,500 విలువైన చెక్కులను 9మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.

Read More
రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో పారదర్శకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యమే సాగుతుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం బీ పవర్ హౌస్​ వద్ద ట్రాక్టర్లను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతుల భూముల కష్టాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. […]

Read More

కాళేశ్వరం.. మత్స్యకారులకు వరం

గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులే కాక మత్స్యకారులు కూడా బాగుపడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. గోదావరి దిశ మార్చిన అపరభగీరథుడు కేసీఆర్​ అని కొనియాడారు. అదివారం ఆయన కుందనపల్లి, గోదావరినది వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్​ సర్కారు అన్ని కులవృత్తులకు న్యాయం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More
సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సారథి న్యూస్​, రామగుండం: సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో వాటా 35శాతం ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామగుండం రీజియన్​ పరిధిలోని వకీల్ పల్లె గనిలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్, ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి రాజరత్నం, సీపీఐ నాయకుడు జి.గోవర్ధన్, శంకర్, కిరణ్, సంపత్, వెంకటేష్, రాజు, మల్లేష్, ప్రదీప్ కార్మికులు పాల్గొన్నారు.

Read More