ఢిల్లీ: నూతన విద్యావిధానంతో మన దేశంలో పెనుమార్పులు సంభవించనున్నాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నూతన విద్యావిధానంతో విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇక విద్యార్థులు వారికి ఇష్టమైన కోర్సును చిన్నప్పడే ఎంచుకోవచ్చని.. హోంవర్కులు, పుస్తకాల మోత ఉండబోదని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో ఈ కొత్త విద్యా విధానం అమల్లోకి రానుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుందని.. నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుందన్నారు. సృజనాత్మకత నిశిత పరిశీలన పెంపొందుతుందన్నారు. […]
అయోధ్య: భారతీయ జాతీయభావాలకు, సంస్కృతికి అయోధ్య రామాలయం ఓ ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అయోధ్య పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. బుధవారం ఆయన అయోధ్యలో రామాలయానికి భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ జైశ్రీరామ్ అనే నినాదం అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని మోదీ అన్నారు. ‘ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఇది యావద్దేశం భావోద్వేగంతో పులకిస్తున్న వేళ. సుదీర్ఘ నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. రామ్ లల్లా కోసం […]
అయోధ్య: అయోధ్యపురిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ భారతదేశం వేయికండ్లతో వేచిచూసిన దృశ్యం కనువిందు చేసింది. దశాబ్దాల పోరాటం ఫలించింది. 130 కోట్ల భారతీయుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలిఅడుగు పడింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజచేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజకు ముందు ప్రధాని మోదీ హనుమాన్‌గర్హిలో పూజలు నిర్వహించారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని పూజలు […]
అయోధ్య: ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో అయోధ్యకు విచ్చేసిన ప్రధానికి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, పలువురు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అయోధ్యలోని హనుమాన్గడికి చేరుకొని ప్రత్యేకపూజలు చేశారు. రామ్లాలాలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం 12.44 నిమిషాలకు ప్రధాని రామజన్మభూమిలో రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.
చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్‌గా […]
లఖ్‌నవూ: ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతోందని కేంద్రనిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ను రద్దుచేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా […]
న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజకు ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయోధ్య రామమందిర భూమిపూజకు హాజరు కావల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ […]
సారథిన్యూస్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ 27న (సోమవారం) సీఎంలతో సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్ కట్టడికి వ్యూహాలు, అన్‌లాక్ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని మోడీ చర్చించనున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, అన్ లాక్ 2.0 తర్వాత పెరిగిన కరోనా కేసులు, దేశంలో అత్యధికంగా జరుగుతున్న కరోనా టెస్టుల వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర […]