అయోధ్య: ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో అయోధ్యకు విచ్చేసిన ప్రధానికి ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, పలువురు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అయోధ్యలోని హనుమాన్గడికి చేరుకొని ప్రత్యేకపూజలు చేశారు. రామ్లాలాలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం 12.44 నిమిషాలకు ప్రధాని రామజన్మభూమిలో రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.
సారథి న్యూస్, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని, టీవీల్లోనే పూజా కార్యక్రమాలను వీక్షించాలని కోరింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను పిలవాలనే యోచనలో ఉన్నట్టు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు. కాగా, ఆలయ నిర్మాణానికి అన్ని మతాల ప్రజల నుంచి విరాళాలు స్వీకరించనున్నట్టు ట్రస్టు సభ్యుడు, […]
అయోధ్య : యావత్ ప్రపంచం గర్వించేలా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని రామ మందిరం, హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 5న జరగనున్న శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ కార్యక్రమం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్య దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. “ ప్రధాని మోడీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. కచ్చితంగా అయోధ్యని దేశం, […]