Breaking News

BJP

రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్​రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్​బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్​జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక […]

Read More
దుబ్బాక బీజేపీదే

దుబ్బాక బీజేపీదే

గులాబీ కోటలో కాషాయ జెండా రెపరెపలు ఉత్కంఠ పోరులో రఘునందన్‌ రావు విజయం కారును పోలిన సింబ‌ల్‌ను 3,489 ఓట్లు సారథి న్యూస్, దుబ్బాక: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్యరీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం చూపి టీఆర్‌ఎస్‌ […]

Read More
సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ​చేస్తూ స్థానిక తహసీల్దార్ జయరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవరికి రూ.2,500, పత్తికి రూ.8,000, అలాగే నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో […]

Read More
హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More
కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్​ నీట మునిగిందని మున్సిపల్ ​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ​ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]

Read More
దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాల దాడి హేయమైనచర్య అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపై దాడిచేసిన దుండగుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు […]

Read More
దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలంగాణ భవన్​లో గురువారం చిట్ చాట్ చేశారు. ఆర్ బీఐ తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రుణాలు అత్యధికంగా మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా డబ్బా మేం కొట్టుకోవడం కాదు. ఇది ఆర్​బీఐ నివేదిక చెబుతుందన్నారు. మొత్తం రూ.27,718 కోట్లు రుణమాఫీకి నిధులు వెచ్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుకు మరో రూ.28వేల కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా, ఇన్​పుట్ సబ్సిడీకి […]

Read More
బీజేపీ నేతల అరెస్ట్​అక్రమం

బీజేపీ నేతల అరెస్ట్ ​అక్రమం

సారథి న్యూస్, బిజినేపల్లి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ ​చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే మంత్రి టి.హరీశ్​రావును రంగంలోకి దించి పోలీసులతో రఘునందన్​రావు బంధువుల ఇంటికి పోలీసుల సహాయంతో డబ్బులు పంపించారని విమర్శించారు. మాజీ ఎంపీలు వివేక్, ఏపీ జితేందర్​రెడ్డి అక్రమంగా అరెస్ట్ ​చేశారని ఖండించారు. అనంతరం […]

Read More