Breaking News

POLICE

డీసీపీ సార్​.. మీరు సూపర్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఓ పోలీస్​ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్​అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు […]

Read More

దళిత యువతిపై 143 మంది లైంగికదాడి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఓ దళిత యువతపై ఏండ్ల తరబడి 143 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. దేశంలోని పలుప్రాంతాలకు ఆమెను తిప్పి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారం జరిపిన వాళ్లలో విద్యార్థినాయకులు, రాజకీయనాయకుల పీఏలు, పలువురు టీవీ, సినీ రంగానికి చెందినవారు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్క హైదరాబాద్​ నగరమే కాదు.. యావత్​ తెలంగాణ సమాజమే ఉలిక్కిపడింది. ప్రస్తుతం 143 మందిపై కేసు నమోదైనట్టు […]

Read More

సోనాక్షిసిన్హాకు ఆన్​లైన్​లో వేధింపులు

ముంబై: బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సోనాక్షి సిన్హాను దూషిస్తూ.. ఔరంగాబాద్ కు చెందిన ఓ యువకుడు (27) సోషల్ మీడియాలో పోస్ట్​చేశాడు. దీంతో సోనాక్షి ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్ వేధింపులపై ముంబై సైబర్ పోలీసులు తీసుకున్న చర్యలకు సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆన్‌లైన్ లో వేధింపులు నేను సహించను. అందుకే ఫిర్యాదు చేశారు. నా ఫిర్యాదుకు స్పందించిన ముంబై పోలీసులకు […]

Read More

నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

సారథిన్యూస్​, రామగుండం: రామగుండం కమిషనరేట్​ పరధిలో గణేశ్​ మండపాలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్​ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నివారణ గురించి అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు.

Read More
31వరకు లాక్​డౌన్​

పెద్దశంకరంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్​డౌన్​ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్​హాల్​లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్​, తహసీల్దార్​, ఎస్సై, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్​ ఉపాధ్యక్షడు […]

Read More
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, కర్నూలు: కరోనాపై యుద్ధంలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా ఉంటూ కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు ఎస్పీ డాక్టర్​ ఫక్కీరప్ప అన్నారు. కరోనా బారినపడి మృతిచెందిన పోలీస్​ హెడ్​కానిస్టేబుల్​ ఎస్​ఏ మాలిక్​బాషా కుటుంబసభ్యులకు 1993 బ్యాచ్​ పోలీసులు సేకరించిన రూ.లక్ష సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ నుంచి వచ్చే బెనిఫిట్స్​ త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More

గణేశ్​ మండపాలకు నో పర్మీషన్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి గణేశ్​ పండుగను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More

ముగ్గురిని రక్షించిన స్థానికులు

సారథి న్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేటీఅన్నారం వద్ద మూసీ నదిలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులను పోలీసులు.. స్థానికుల సహకారంతో కాపాడారు. కొన్ని రోజులుగా భారీవర్షాలు కురుస్తుండడంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఖాసీంపేటకు చెందిన షబ్బీర్​, సోహాల్​, కైఫ్​ అక్కడికి.. మూసీనదిని చూసేందుకు అక్కడికి వచ్చారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాలుజారి పడిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు, ఫైర్​సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో నదిలో చిక్కుకున్న యువకులను కాపాడారు.

Read More