సారథి న్యూస్, రామాయంపేట: రైతు వేదికలను రైతుశిక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గురువారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలో యూరియాను తగ్గించేయాలని సూచించారు. తక్కువ మోతాదులో వాడితే పంటకు నష్టం తగ్గి.. మంచి దిగుబడి వస్తుందన్నారు. అలాగే పంటలకు తెగుళ్లు వస్తే వాటికి సరిపడా మందులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జ్ వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్‌కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం, మద్దూరు, కలుగొట్లలో రైతు వేదిక భవనాలను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రైతు వేదికల వద్ద రైతాంగం సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ శృతిఓజా, సర్పంచ్ లక్ష్మీదేవి, […]
సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్‌జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని […]
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సంస్కృతిలో వ్యవసాయం ఓ భాగమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రైతువేదిక భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి గంగుల కమాలకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజ, కలెక్టర్ శశాంక, గ్రంథాలయసంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి, […]
సారథిన్యూస్, వనపర్తి: రైతు వేదిక నిర్మాణాలను వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా నాగవరం శివారులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణపనులను ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో కే చంద్రారెడ్డి, తహసీల్దార్ రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, సూర్యాపేట: రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. రైతురాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి దివంగత శానంపూడి అక్కిరెడ్డి స్మారకార్థం నిర్మించనున్న రైతువేదిక నిర్మాణాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ […]