సామాజికసారథి, వనపర్తి: కంచే చేను మేసిందన్న చందంగా అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే అడ్డదారులకు సహకరిస్తుండటం వనపర్తి జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యాభివృద్దికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుండడాన్ని కొందరు విద్యాశాఖ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను సైతం ఇటీవల భర్తీ చేసింది. దీంతో కొత్త టీచర్లు జాయిన్ కావడం, మరికొందరు ప్రమోషన్లతో ఇతర స్కూళ్లకు వెళ్లిపోవడంతో జిల్లాలో అక్కడక్కడా […]
సామాజికసారథి, వనపర్తి: అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. పంటలు పండక దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూర్ గ్రామంలో ఓ రైతు పంట కాల్వను పూడ్చి వేయడంతో ఆ కాల్వపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడం, ఇప్పుడిప్పుడే జూరాల ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని దిగువకు వదలడంతో రైతులంతా ఆలస్యంగానైనా వరినాట్లు వేస్తున్నారు. ఇతర పంటలను సాగుచేసుకుంటున్నారు. కానీ సూగూరు గ్రామంలోని కొందరు […]
సామాజికసారథి, వనపర్తి బ్యూరో: ప్రభుత్వ విద్యాభివృద్దికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. వనపర్తి జిల్లాలో ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే గురుకులాలు, కేజీబీవీ లు, మోడల్ కాలేజీ లు ఫలితాల్లో ముందంజలో ఉన్నా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం అట్టడుగుకు పోయాయి. వనపర్తి జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో వనపర్తి బాయ్స్, వనపర్తి […]
సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి డీఈఓ రవీందర్ బరితెగించాడు.తన ఆఫీస్ కు పెట్టిన అద్దె కారును రూల్స్ కు విరుద్దంగా వాడుకోవడమే గాకుండా ఈ విషయాన్ని మీడియాకు చెప్పారన్న అక్కసుతో నిరుపేద కుటుంభానికి చెందిన డ్రైవర్ బాలస్వామి పై తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు.రెండేళ్లగా డీఈఓ ఆఫీస్ కు అద్దెకు పెట్టిన కారు అగ్రిమెంట్ పేపర్లు కూడా డ్రైవర్ కు ఇవ్వకుండా వేధించసాగాడు. తనపైనే మీడియాకు, జిల్లా కలెక్టర్ కు , వనపర్తి రూరల్ […]
-మినిష్టర్, కలెక్టర్ ఎవ్వరికన్నా చెప్పుకో….-వనపర్తి డీఈఓ గా నన్ను తీసేసే దమ్ము ఉందా…-రోజు ఇలాగే సర్కారు కారును వాడుకుంటా…-నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రాసి ఇవ్వాల్సీందేకారు ఓనర్ ను బెదిరిస్తున్న వనపర్తి డీఈఓ రవీందర్సోషల్ మీడియాలో స్టూడెంట్ యూనియన్ నేత, -కారు ఓనర్ కాల్ రికార్డింగ్ హల్ చల్ సామాజిక సారథి, వనపర్తి: వనపర్తి జిల్లా డీఈఓ రవీందర్ సర్కారు కారును రూల్స్ కు విరుద్దంగా వాడుకుంటూ కారు ఓనర్ ను వేదిస్తున్న విషయంపై శనివారం సామాజిక […]
సామాజిక సారథి,వనపర్తి: స్వంత పనులకు సర్కారు కారు ను వాడుకోవద్దన్న రూల్ వనపర్తి డీఈఓ రవీందర్ కు పట్టడం లేదు.వనపర్తి డీఈఓగా రవీందర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అవినీతి, ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. డీఈఓ గా వనపర్తి జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల ను విజిట్ చేయాల్సిన రవీందర్ సర్కారు స్కూళ్ల ను గాలికొదిలేశారు. తన సొంత గ్రామం మహబూబ్ నగర్ కావడంతో సర్కారు ఇచ్చిన […]
వనపర్తిలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏడేళ్లలో 65 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు పెంచాం వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి సామాజిక సారథి, వనపర్తి : వైద్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్టాన్న్రి నిలపడమే లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం, 20 పడకలతో నిర్మించిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. […]
సారథి న్యూస్, వనపర్తి: నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.విజయ రాములు, ఏఐటీయూసీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మాసన్న, పార్టీ సీనియర్ నాయకుడు డి.చంద్రయ్య పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆఫీసులో శనివారం ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిరంకుశ ధోరణి అనుసరిస్తూ హక్కులను కాలరాస్తున్నాయని […]