జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్‌కల్యాణ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్‌కల్యాణ్ భారీ కటౌట్ కడుతుండగా సోమశేఖర్, అరుణాచలనం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్‌షాక్‌తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్‌కల్యాణ్ తీవ్ర విచారం […]
సారథి న్యూస్, రామడుగు: ఇటీవల కరోనాతో మృతిచెందిన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్ కటుకం రవీందర్‌కు ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పూడూరి మల్లేశం, నేరెల్ల అంజయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, పైండ్ల శ్రీనివాస్, రజబ్ అలీ, […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి ఓ సర్పంచ్‌ను బలితీసుకుంది. తమతో కలిసి తిరిగిన వ్యక్తి.. తమ బాగోగులు పట్టించుకున్న నేత ఇక లేడన్న వార్త ఆ ఊర్లో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం రవీందర్ గురువారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రవీందర్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎన్నో […]
కోల్‌కతా: కరోనా బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సమరేష్ దాస్ కొంతకాంగా కరోనాతో బాధపడుతున్నారు. కరోనా విపత్తువేళ ఆయన నియోజకవర్గంలో పర్యటించి పేదప్రజలకు సేవచేశారు. కూరగాయలు, నిత్యావసరసరుకులు పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది.దీంతో కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమరేస్ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకుముందు జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)కరోనాతో మృతి […]
సారథి న్యూస్, కర్నూలు: వివిధ పత్రికల్లో సబ్ఎడిటర్గా పనిచేసిన అక్కలదేవి రాజా(30) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన రాజా.. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో సబ్ఎడిటర్గా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలు పనిచేయడంతో ఇక్కడి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో రాజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతికి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే రాజా తమ […]
సారథిన్యూస్, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్ లాక్కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు […]
వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం కర్నూలు నుంచి చీరాలకు వేటపాలెం మండలం అక్కాయి పాలెం జాతీయరహదారి ప్తె వస్తున్న కారు ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం లో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
సారథి న్యూస్, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు జారి బావిలో పడ్డారు. స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడగా, మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.