Breaking News

మాస్కులు

మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: మాస్కులు లేకుండా బయటకు రావొద్దని సర్పంచి తొడేటి రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో పలు వార్డుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయించి మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బస్టాండ్, మండల, జిల్లా కేంద్రాల్లోని షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకుండదన్నారు. కరోనా మాకు రాదంటూ అభద్రత భావంతో […]

Read More

ఆటోడ్రైవర్లకు మాస్కుల పంపిణీ

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ నాయకుడు మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్​ మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య, జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, చందు, తౌఫిక్, మంథని మధు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆదివాసీలకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, ఖమ్మం: ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, వారి హక్కులను పరిరక్షిస్తామని భారత మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్​ మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామంలో గురువారం మానవహక్కుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గిరిజనలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారి ఇండ్లను పరిశీలించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More
ఫేక్​ మాస్కుల గుట్టురట్టు

నకిలీ మాస్కుల దందా గుట్టురట్టు

ముంబై: కరోనా నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఎన్​95 మాస్కులంటూ నకిలీవి తయారు చేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి నకిలీ మాస్కుల రాకెట్​ను ముంబై పోలీసులు ఛేదించారు. రూ.21.39 లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి భారీ ఎత్తున నకీలీ మాస్కులను తీసుకొచ్చాడు. అనంతరం వాటిని ముంబై, థానేలోని పలు మెడికల్​ షాపుల్లో విక్రయించాడు. పోలీసులకు ఫిర్యాదుల అందడంలో […]

Read More
మాస్కు లేదా.. తీస్కో

మాస్కు లేదా.. తీస్కో

సారథి న్యూస్, జనగామ: జనగామ జిల్లా కొండకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామం నుంచి మంగళవారం కొండకండ్ల మండల కేంద్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్నారు. మార్గమధ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలను చూసి కారు ఆపారు. వారికి మాస్కులు లేకపోవడంతో వాటిని పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కూలీలకు సూచించారు.

Read More

జాగ్రత్తలతో కరోనాను జయిద్దాం

సారథి న్యూస్, వాజేడు: భౌతికదూరం పాటించడం, నిరంతరం చేతులను శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించి కరోనాను జయించాలని వాజేడు ఎంపీపీ శారద సూచించారు. శనివారం ములుగు జిల్లా వాజేడు మండలం ఆరుగుంటపల్లిలో ఆమె వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్​ మంకిడి వెంకటేశ్వర్​రావు , హెచ్​ఎస్​ కోటిరెడ్డి, హెచ్​ఏ శ్రీనివాస్​, ఆశాకార్యకర్తలు, అంగన్​వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More
మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

సారథి న్యూస్, మహబూబ్​ నగర్: హన్వాడ సీహెచ్ సీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నర్సులకు, ఆశా కార్యకర్తలకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాఠశాల వద్ద వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. తెలంగాణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. అనంతరం మహబూబ్ నగర్​ బోయపల్లి గేట్ సమీపంలో ఉన్న వీవీ కన్వెన్షన్ లో వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు […]

Read More