Breaking News

మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: మాస్కులు లేకుండా బయటకు రావొద్దని సర్పంచి తొడేటి రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో పలు వార్డుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయించి మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బస్టాండ్, మండల, జిల్లా కేంద్రాల్లోని షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకుండదన్నారు. కరోనా మాకు రాదంటూ అభద్రత భావంతో గ్రామంలో తీరుగుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి నెల్లి శ్రీనివాస్, గ్రామ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.