సారథి న్యూస్, రామాయంపేట: గడపగడపకు బీజేపీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శనివారం బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ సందేశాన్ని ఇంటింటికీ వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో నెంటురి రమేశ్ గౌడ్, నాతి రమేశ్ గౌడ్, శ్రీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: నేటితరం పిల్లలకు దేశభక్తితో పాటు క్రమశిక్షణ, ఉన్నత వ్యక్తిత్వం నేర్పించాల్సిన బాధ్యత గురువులపై ఉందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే.అరుణ అన్నారు. టీచర్, ప్రముఖ కవి ఎంఎన్ విజయకుమార్ రచించిన ‘విజయ సంకల్పం, విజయతీరాలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా టీచర్లు శ్రద్ధచూపాలని సూచించారు. విద్యతోనే నవ సమాజాన్ని స్థాపించగలమనే నమ్మకాన్ని వారికి […]
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారుల కోసమే రాజ్యసభ ఎలక్షన్స్‌ను లేట్ చేశారని బీజేపీపై విమర్శలు చేశారు. గుజరాత్, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మకాలు పూర్తికాలేదు కాబట్టే ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేశారని ఆరోపించారు. ‘రాజ్యసభ ఎన్నికలు రెండు నెలల క్రితమే జరగాల్సి ఉంది. రాజస్థాన్, గుజరాత్లో ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాలు పూర్తికాలేదు. అందుకే డిలే చేశారు. ఇప్పుడు పరిస్థితి […]
సారథి న్యూస్, మెదక్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మెదక్ జిల్లాకు గడ్డం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డ శ్రీనివాస్ పార్టీలో కార్యకర్తస్థాయి నుంచి జిల్లా అధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు. గతంలో ఉమ్మడి మెదక్ మండలాధ్యక్షుడిగా మూడుసార్లు, మెదక్ ఉమ్మడి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. పార్టీకి అందించిన సేవలకు […]
కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి న్యూఢిల్లీ: వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, శ్రామిక్ రైళ్లు ‘డెత్ పార్లర్లు’గా మారాయని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి విమర్శించారు. లాక్డౌన్ చాలా రోజుల ముందే పెట్టాల్సిందని, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వరకు ఆగి అప్పుడు పెట్టారని బీజేపీపై విమర్శలు చేశారు. మన దేశంలో జనవరిలోనే కరోనా కేసు నమోదైందని, అప్పుడే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు బంద్ పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత […]
సారథి న్యూస్ ఆదిలాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన కు క్యాంపు ఆఫీసులో బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు 2018 -19 కి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా పత్తి రైతులు చెల్లించిన ప్రీమియం 66 కోట్లు కాగా రైతులకు రావాల్సిన రూ. 300 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో […]
సారథి న్యూస్, రామడుగు: రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ కల్పించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుబంధును ఏ విధమైన షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలను వేయాలనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో నాయకులు జెట్టవేని అంజి బాబు, బోయిని వెంకటేశం, మ్యాడారం సత్యనారాయణ, గాలిపల్లి రాజు పాల్గొన్నారు.
బీజేపీ నేతల వినతి సారథి న్యూస్, నర్సాపూర్: సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు తీర్చాలని మెదక్ జిల్లా కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసులో శనివారం బీజేపీ జిల్లా నాయకుడు రాజేందర్, రాకేశ్ వినతిపత్రం అందజేశారు. టెంట్లు వేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. రాజేందర్, రాకేష్ ,రాజు పాల్గొన్నారు