బ్రిస్బేన్: ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం ఆష్లే కూపర్ (86) శనివారం అనారోగ్యంతో మరణించారు. 1958లో ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న కూపర్ నంబర్ వన్ ర్యాంక్‌లోనూ నిలిచాడు. 1957లో ఆస్ట్రేలియా టీమ్ డేవిస్ కప్‌ను నిలబెట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. వెన్ను నొప్పి కారణంగా 1959లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన కూపర్.. ఆ తర్వాత బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. టెన్నిస్ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగాడు. ‘ప్లేయర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా కూపర్ అద్భుతమైన పాత్ర పోషించాడు. […]
సారథి న్యూస్, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా జేఏసీ పిలుపు మేరకు మే నెల నుంచి పూర్తివేతనం, గత రెండు నెలల సగం వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీచర్లు శనివారం ఇంటి వద్దనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా కోశాధికారి టి.రాణి […]
నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: తెలంగాణ సోనా రకం సాగుచేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ. శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నియంత్రిత పంటల సాగు.. పంటమార్పడి విధానంపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్ అధికారులపైనే ఉందని సూచించారు. శనివారం స్థానిక సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష […]
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల ఆర్థికాభివృద్ధికి అహర్నిషలు పాటుపడుతూ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. శనివారం పాలకుర్తి మండలం తక్కలపల్లిలో ఎస్ఆర్ఎస్ కాలువలో పుడికతీత, చెట్ల తొలగింపు పనులతో పాటురూ.76 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ కులీలకు అంబలి, అన్నదానం నిర్వహించారు. రైతులు, కూలీలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పకుండా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు శనివారం రిలీజ్ చేశారు. జులై 1న పాలీసెట్, జులై 1 నుంచి 3వ తేదీ వరకు పీజీ సెట్, 4న తెలంగాణ ఈసెట్, 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10న లాసెట్, పీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో […]
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథి న్యూస్, మెదక్: సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడంతో పాటు వారిని సురక్షితంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిఒక్కరూ మెదక్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, […]
సారథి న్యూస్, మెదక్: సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్ కు గురై బాలికమృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి బాలమణి, కిష్టయ్య కూతురు స్రవంతి(9) ఉదయం సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యారు. స్రవంతి మృతితో […]
మంత్రి సబితాఇంద్రారెడ్డి సారథి న్యూస్, మహేశ్వరం: రైతులకు నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పోతర్ల బాలయ్య ఫంక్షన్ హాల్ లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులు లాభాసాటి పంటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ జ్యోతి, కందుకూరు మండల ఎంపీపీ జ్యోతి పాల్గొన్నారు.