ఎమ్మెల్యే సొంత మండలంలోనే అంబులెన్స్ సౌకర్యం లేదు బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సామాజికసారథి, తిమ్మాజిపేట: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సొంత మండలమైన తిమ్మాజిపేటలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 […]
75 ఏళ్ల పాలనలో సరైన బట్టలు కూడా లేవు మేం అధికారంలోకి వస్తే అన్ని కులాలకు సమన్యాయం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, హైదరాబాద్: ఇంకెంత కాలం మనం యాచకులుగా బతకుదామని, ఎంతకాలం కూలీలుగా బతుకుదామని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 75 ఏళ్ల పాలనలో సంచార జాతులకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాధికార యాత్రలో […]
చేతనైతే యూనివర్సిటీలు, ఆస్పత్రులు, మేధావులతో సర్వేచేయించు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ తెలంగాణ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ తో మిలాఖత్ అవుతున్నాయని ఫైర్ సామాజికసారథి, నిజామాబాద్ ప్రతినిధి : కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయే స్థితిలో ఎగ్జిట్ మోడ్ లో ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అందుకే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఎద్దేవాచేశారు. సర్వేలతో బిజీగా ఉన్న టీఆర్ఎస్ […]
హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలను పరామర్శించిన ఆర్ఎస్పీ పులుల పేరుతో మనుషులను హింసిస్తారా? మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని […]
బీఎస్పీ కల్వకుర్తి ఇన్చార్జ్ కొమ్ము శ్రీనివాస్ యాదవ్ సామాజికసారథి, కడ్తాల్: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా సాగింది. హైస్కూలు హెచ్ఎం విజయ, ఎల్ఐసీ రిటైర్డ్ ఆఫీసర్ తౌర్యానాయక్తమ సొంత ఖర్చులతో ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా ఎంపీపీ కమ్లీ నాయక్, జడ్పీటీసీ దశరథ్ నాయక్, బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్ము శ్రీనివాస్ యాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన పాల్గొన్నారు. […]
సామాజికసారథి, ఖమ్మం: తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలకోట్ల వక్ఫ్ బోర్డు […]
సామాజికసారథి, కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు ఆంజనేయులు ఇటీవల కరెంట్‌షాక్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్కొమ్ము శ్రీనివాస్‌యాదవ్ బుధవారం అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆంజనేయులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
సామాజికసారథి, సిద్దిపేట: బహుజన రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్‌పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో జరిగే రాజ్యాధికార యాత్రలో యువత అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర చీఫ్కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. స్వేరో స్టూడెంట్ యూనియన్(ఎస్ఎస్యూ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన భారీ ర్యాలీగా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని […]