Breaking News

పారిశుద్ధ్యం

పారిశుద్ధ్యం అధ్వానం

ఇంత నిర్లక్ష్యమా?

సారథి న్యూస్​, రామగుండం: పారిశుద్ధ్యం విషయంలో రామగుండం మున్సిపాలిటీ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు శనిగల శ్రీనివాస్​, శనిగరపు చంద్రశేఖర్​ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరోనాతోపాటు ఇతర వ్యాధుల ముంపు పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం టెస్టులు చేయకపోవడంతో పేదలు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చేపడతామని పేర్కొన్నారు.

Read More

పారిశుద్ధ్యానికే ప్రాధాన్యం

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్రప్రభుత్వం పారిశుద్ధ్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నదని రామాయంపేట డిప్యూటీ కమిషనర్​ రవీందర్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో డంపింగ్​ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన మెదక్ డీపీవో హనోక్ తో కలసి నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి దగ్గరే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ రెడ్డి, ఎంపీపీ […]

Read More

నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం

సారథిన్యూస్​, మహబూబాబాద్​: పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్​ కలెక్టర్​ గౌతమ్​ హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇల్లందు బై పాస్ రోడ్ లో కలెక్టర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురికి కాల్వల్లో చెత్తను ఏరోజుకారోజు తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్​ సూచించినట్టుగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలపాటు నిలువ ఉన్న నీటిని తొలగించాలని ఆదేశించారు. పట్టణంలోని పలు టైర్ల షాపులను పరిశీలించారు. అక్కడ నీరు […]

Read More

ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉండాలె

సారథి న్యూస్​, హైదరాబాద్: వానాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉండాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లోని తన నివాసం ప్రగతి భవన్ ఆవరణలోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడమే మేలని మంత్రి కేటీఆర్​ సూచించారు.

Read More

వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి

సారథి న్యూస్​, గోదావరిఖని: పారిశుద్ధ్య నిర్వహణ అందరి బాధ్యత అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు పరిసరాలను శుభ్రంచేశారు. గార్డెన్ లో చెత్తను తీసివేయడంతో పాటు నిలువ ఉన్న నీటిని పారబోశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read More

పారిశుద్ధ్యం అందరి బాధ్యత

సారథి న్యూస్​, షాద్​నగర్​: ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీని కలెక్టర్ అమోయ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక సోలీపూర్, హాజిపల్లి రోడ్డులో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, ఫరూఖ్ నగర్ లోని జానమ్మ చెరువును పరిశీలించారు. చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ లావణ్య కలెక్టర్ కు వివరించారు. హరితహారంలో పట్టణంలో విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్​ సూచించారు. పారిశుద్ధ్య పనులను పూర్తిస్థాయిలో చేపట్టి సీజనల్ […]

Read More

సీజనల్​ వ్యాధులపై జాగ్రత్త

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ సూచించారు. స్పెషల్​ డ్రైవ్​లో భాగంగా సోమవారం మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ, మర్లు, నలంద ఆటోస్టాండ్​ ప్రాంతాల్లో పర్యటించారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాలాలు, రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పట్టణవాసులు చూసుకోవాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, […]

Read More

ఉత్సాహంగా పల్లెప్రగతి

సారథి న్యూస్​, రామడుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతితో పాటు పాలకవర్గ సభ్యులు వివిధ వార్డులను సందర్శించి పారిశుద్ధ్యం తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో సముద్రాల శ్రీను, నీలం రవి, సుబద్ర, మాజీ సర్పంచ్ పంజాల జగన్మోహన్, మామిడి కుమార్, పెందోట రాజు, మామిడి అంజయ్య పాల్గొన్నారు.

Read More