సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా ఎస్పీని స్వేరోస్ నాయకులూ గురువారం కలుసుకున్నారు. కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎస్పీతో చర్చించారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యాలపై స్వేరో నెట్వర్క్ పని చేస్తుందని వివరించారు. ఎస్పీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ జోనల్ అధ్యక్షుడు గిద్ద విజయ్ కుమార్ స్వేరో, టిఎస్పిఏ నాగర్ కర్నూల్ జిల్లా […]
టీఆర్ఎస్, బీజేపీలకు నిబంధనలు వర్తించవా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ నేతల దోస్తానం ఢిల్లీలోనే కాదు, గల్ళీలో కూడా నడుస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరాలకు పర్మిషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ లో 120 మందితో కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ […]
ఉత్తమాటలు కట్టిపెట్టాలి: వీహెచ్ సామాజిసారథి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అవినీతి దేశంలో ఎక్కడా లేదని బీజేపీ నాయకుడు జేపీ నడ్డా చెబుతున్నారని, దమ్ముంటే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఆయన ఢిల్లీనుంచి తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతానని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌నే జైల్లో పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతానని బీజేపీ చెప్పడమేనా, […]
వాకిళ్లలో ముగ్గులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు 10న ముగింపు కార్యక్రమాలు మంత్రి కె.తారక రామారావు సామాజిక సారథి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు. రైతుబంధు కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్లు రైతన్నల ఖాతాల్లోకి చేరిన శుభసందర్భంగా సెలబ్రేట్ చేసేందుకు మనమంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా జడ్పీ చైర్మన్లతో […]
సామాజికసారథి, నాగర్‌కర్నూల్: పెద్దముద్దునూర్ గ్రామంలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్‌ఇళ్లు, బస్టాండ్‌ను తక్షణమే ప్రారంభించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఏడాదిలో నిర్మించినప్పుడు.. పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తిచేయలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయన బీఎస్పీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ వర్గం అని అమాయక జనాలను ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. సర్పంచ్, […]
సామాజిక సారథి, తుర్కయంజాల్: గుజరాత్ ఈనెల 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్న సేంద్రియ వ్యవసాయ విధాన్ని ప్రతిఒక్కరూ టీవీల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మోర్చా జాతీయ కార్యవర్గం సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ రవీంద్ర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం, సీఐటీయూల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల్లో కార్మికులకు గత మూడు నెలల నుంచి బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. మరొకవైపు కరోనా కారణంగా పాఠశాలల మూతపడి […]
సామాజిక సారథి, తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సీఎల్ఆర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉయ్యాలవాడ, కోడేర్, తాడూర్ బీసీ గురుకులాల్లో 600మంది విద్యార్థులకుగాను 12మంది టీచర్లు పనిచేస్తున్నారన్నారు.16సెక్షన్లు ఉంటే సెక్షన్ కి ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరన్నారు. 80మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పడుకోవడానికి కూడా వసతులు లేని స్థితిలో […]