Breaking News

కాళేశ్వరం

భూసేకరణ నిలిపివేయాలి

భూసేకరణ నిలిపివేయండి

సారథి, రామడుగు: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైన కరీంనగర్​జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపు హౌస్ నుంచి మిడ్ మానేరుకు అదనంగా మూడవ టీఎంసీ జలాల తరలింపునకు చేపట్టబోయే నూతన కాల్వ భూసేకరణను నిలిపివేయాలని శానగర్ గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్​ కోమల్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్మించిన వరద కాల్వ భూసేకరణలో చాలా మంది రైతులు తమ విలువైన భూముల కోల్పోయారని, ఇప్పుడు రెండవ, మూడవ సారి ఇండ్లు, భూములను […]

Read More
కాళేశ్వరంతో జల వనరులకు జలకళ

కాళేశ్వరంతో జల వనరులకు జీవకళ

కఠోర ప్రయత్నం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది ఉపనదులను జీవనదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే రైతుగర్వంగా సమాజంలో తలెత్తుకుని బతకాలన్నదే ఆయన ఆశ ‘సారథి’ ఇంటర్వ్యూలో సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి సారథి, మెదక్: ప్రణాళికతో గోదావరి నీళ్లు మళ్లించి జీవం కోల్పోయిన ఎన్నో వాగులు, ఉప నదులు, చెక్​డ్యాంలు, చెరువులకు సజీవ సాగునీటి వనరులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావుకే దక్కిందని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి […]

Read More
పాలమూరు పచ్చబడాలి.. ప్రాజెక్టు పనులు పరుగులు తీయాలి

పాలమూరు పచ్చబడాలి..

హైదరాబాద్​: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టాలని, డిసెంబరు నాటికి పూర్తికావాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో అధికారులు వేగంగా పనులు చేయాలని సూచించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పంపులను జూన్ చివరి నాటికి బిగించాలని, టన్నెల్ పనులు కూడా అప్పటికల్లా పూర్తికావాలని స్పష్టం చేశారు. కాల్వ లైనింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రగతి […]

Read More
కాళేశ్వరం సంతోషానిచ్చింది

కాళేశ్వరం సంతోషానిచ్చింది

తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చేసింది ఇదే స్ఫూర్తితో తుపాకులగూడెం, దుమ్ముగూడెం పనులు కాళేశ్వరం పర్యటనలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు సారథి న్యూస్, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా సాగుతోందని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తికావడంలో కృషిచేసిన నీటిపారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన […]

Read More
బహిరంగ చర్చకు సిద్ధమేనా?

బహిరంగ చర్చకు సిద్ధమేనా?

సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్​అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. […]

Read More

రైతులకు పరిహారం చెక్కులు

సారథి న్యూస్​, కరీంనగర్​: కరీంనగర్​ జిల్లా మానకొండూరు నియోజవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పర్యటించారు. కాళేశ్వరం జలాలను తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో తీసుకెళ్లే క్రమంలో భూములు కోల్పోతున్న రైతులకు పర్లపల్లి గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్​కుమార్​ ఉన్నారు.

Read More

ఉనికి కోసమే జల దీక్షలు

సారథి న్యూస్, రామడుగు: ఉనికికోసమే కాంగ్రెస్​పార్టీ జలదీక్షల పేరుతో రైతులను రెచ్చగొడుతున్నదని జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఆర్ వివేకానంద పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం జలాశయాన్ని అతితక్కువ కాలంలో నిర్మించిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు వాళ్లను విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు.

Read More

సాగుపై దుష్ప్రచారం తిప్పికొట్టండి

సారథి న్యూస్​, రాజన్న సిరిసిల్ల: నియంత్రిత పంటల సాగు విధానంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం గంభీరావుపేట మండల జనరల్​ బాడీ మీటింగ్​కు హాజరయ్యారు. గంభీరావుపేట మండలంలో రూ.22కోట్ల వ్యయంతో నాలుగు చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నామని, కాల్వల భూసేకరణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్యాకేజీ 9, 12 ద్వారా గంభీరావుపేట మండలంలో 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. […]

Read More