Breaking News

Day: June 10, 2020

ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి

సారథి న్యూస్​, వనపర్తి: రోజురోజుకూ రకరకాల వ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని పారిశుద్ధ్యం, అనారోగ్య సమస్యలు తదితర వాటిపై అవగాహన కల్పించాలని పోలీసుశాఖ అధికారులు, సిబ్బందికి వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు. బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల బారినపడకుండా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయట తిరగొద్దని సూచించారు. వనపర్తి సీఐ సూర్యనాయక్, వనపర్తి […]

Read More

పనులు పూర్తయితేనే సంతకాలు పెట్టండి

సారథి న్యూస్​, నల్లగొండ: మిషన్ భగీరథ పనులు అసంపూర్ణంగా ఉన్నప్పుడు సర్పంచ్​లు పూర్తయినట్లు సంతకాలు పెట్టకూడదని మంత్రులు గుంటకండ్ల జగదీశ్వర్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మిషన్ భగీరథ పథకం పుట్టిందే మునుగోడులో పుట్టిన ఫ్లోరిన్ ను నిరోధించడం కోసమేనని అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 843 పంచాయతీలు 1,670 ఆవాస ప్రాంతాలతో పాటు 19 మున్సిపాలిటీలను కలుపుకుని మొత్తం 1,689 ఆవాసాల్లో మిషన్​ భగీరథ పథకం ద్వారా మంచి […]

Read More

కరోనా లక్షణాలుంటే లీవ్​ తీసుకోండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా(కోవిడ్​–19) వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని, తద్వారా కొందరు పోలీసులు వైరస్ బారిన పడ్డారని వెల్లడించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సెలవు పెట్టాలని […]

Read More

సాగుపై దుష్ప్రచారం తిప్పికొట్టండి

సారథి న్యూస్​, రాజన్న సిరిసిల్ల: నియంత్రిత పంటల సాగు విధానంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం గంభీరావుపేట మండల జనరల్​ బాడీ మీటింగ్​కు హాజరయ్యారు. గంభీరావుపేట మండలంలో రూ.22కోట్ల వ్యయంతో నాలుగు చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నామని, కాల్వల భూసేకరణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్యాకేజీ 9, 12 ద్వారా గంభీరావుపేట మండలంలో 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. […]

Read More

కొత్తగా 191 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 4,111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 156 మంది కరోనా పీడితులు చనిపోయారు. చికిత్స అనంతరం 1,817 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2138కి చేరింది. అయితే మేడ్చల్​ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్​ నగర్​ 4, జగిత్యాలలో 3, మెదక్​ 3, నాగర్​ కర్నూల్​ 2, కరీంనగర్​ 2 […]

Read More

అంబేద్కర్​ అడుగుజాడల్లో నడుద్దాం

సారథి న్యూస్​, బోయినిపల్లి: బడుగుల ఆశాజ్యోతి డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ పిలుపునిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బడుగు బలహీనవర్గాలకు ఎన్నో హక్కులు కల్పించాలని గుర్తుచేశారు. ఆ మహనీయుడి ఆశయసాధనకు మనమంత పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే రవిశంకర్​ ఉన్నారు.

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే మాకు చెప్పండి

సారథి న్యూస్, హుస్నాబాద్: కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్సై దాసు సుధాకర్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. పురుగు మందుల బిల్లులను రైతులు భద్రంగా దాచిపెట్టాలన్నారు. ఎక్కడైనా నకిలీ ఎరువులు, విత్తనాలను అమ్మినట్లు గుర్తిస్తే డయల్​ 100, సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ 7901100100 వాట్సాప్ నంబర్​కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Read More

అవకతవకలపై విచారణ జరిపించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా భావించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారంలో జరిగిన అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బుధవారం పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ఎంతమంది రైతులు, నిర్వాసితులకు నష్టపరిహారం అందించారో చెప్పాలన్నారు. అవకతవకలపై సీఐడీ ఆఫీసర్లతో విచారణ జరిపించాలని […]

Read More