ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. […]
కొరవడిన మొయింటనెన్స్ డీజిల్ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ సామాజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాకు కేటాయించిన హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి గంగాధర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్ తో కలిసి ఆమె సమీక్ష […]
ధాన్యం అమ్ముకోలేక నానాఇబ్బందులు డిండి ముంపు రైతులను ఆదుకోవాలి ‘ధరణి’లో తప్పులు ప్రభుత్వ వైఫల్యమే బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమలలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర సామాజికసారథి, అచ్చంపేట/చారకొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ లో భూమి తప్పుగా నమోదైందని, భువనగిరి కలెక్టరేట్ […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో […]
సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలానికి ఈనెల 10న జరగనున్న పోలింగ్ సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను, పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సోమవారం జిల్లా ఎన్నికల అధికారి హరీష్, సహాయ ఎన్నికల అధికారి రమేష్ తో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ కు ఉన్న కిటికీలను ప్లయి ఉడ్ తో పూర్తిగా మూసివేయాలని, కళాశాలో ఉన్న […]
సామాజిక సారథి, నల్లగొండ: మైనార్టీ ఉద్యగుల సమస్యలు పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సయ్యద్ షౌకత్ అలీ ఖాన్ అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఉద్యగులకు, పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజన లేదని […]
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.