Breaking News

రామగుండం

నిత్యావసర సరుకులు పంపిణీ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో ప్రైవేట్​ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి మాట్లాడుతూ.. కరోనా, లాక్​డౌన్​తో ప్రైవేట్​ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అందుకే వారికి తమవంతుగా ఈ సాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్​క్లబ్​ ప్రధాన కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి గుండా రాజు, సభ్యులు శరత్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భేణిగోపాల్ త్రివేది, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

రజకుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథిన్యూస్​, రామగుండం: రజకుల సమస్యలను పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 9వ డివిజన్​లో దోబీఘాట్​ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులవృత్తులను నమ్ముకుని జీవించే రజకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు. రూ. 5 లక్షల నిధులతో దోభీఘాట్ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం 8వ డివిజన్​లోని తెలంగాణ అడ్వంచర్ అక్వాడ్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ […]

Read More

భావితరాల కోసమే హరితహారం

సారథిన్యూస్​, గంగాధర/రామడుగు/రామగుండం: భావితరాలు బాగుండాన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా మంగపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రామడుగు మండలం గోపాల్​రావుపేటలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఆవరణలో పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ అధికారులు, సిబ్బందితో కల్సి పండ్ల మొక్కలను నాటారు. ఆయా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కర్ర […]

Read More

నాటిన మొక్కలను రక్షిద్దాం

పెద్దపల్లి: మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం ముఖ్యమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​స్టేషన్​లో సీఐ రమేశ్​, ఎస్సై అనూష మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలోని ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ రాజన్​ […]

Read More

పర్యావరణాన్ని కాపాడుకుందాం

సారథి న్యూస్​, గోదావరిఖని: ప్రతిఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆర్జీ1 జీఎం కె.నారాయణ, రామగుండం ఎన్విరాన్​మెంట్​ ఇంజనీర్ కె.రామదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్ జీ 1 జీఎం ఆఫీసులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచభూతాలను కలుషితం చేయొద్దన్నారు. సింగరేణి ఏరియాలో ఎక్కువ మొత్తంలో మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జీవవైవిధ్యంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు మెమొంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు దామోదర్ రావు, అధికారుల సంఘం […]

Read More

గనిలో పేలుడు.. నలుగురి దుర్మరణం

సారథి న్యూస్​, గోదావరిఖని: జిల్లా రామగుండం డివిజన్-3 పరిధిలోని ఓపెన్ కాస్ట్(ఉపరితల గని)-1 లోని ఫేస్-2లో గల బ్లాస్టింగ్ స్పాట్ వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు కార్మికులు బండి ప్రవీణ్ (గోదావరిఖని), రాజేష్( ఖమాన్పూర్), అంజయ్య, రాకేష్ మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు వెంకటేష్, భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని రామగుండం పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

కోల్​ బెల్ట్​లో ఎండ కాక

46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్​ బెల్డ్​ ఏరియాలో భానుడు భగభగ మండిపోతున్నాడు.. రోజురోజుకూ ఎండ, వడగాలుల తీవ్రత భరించలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అసలే వేసవి.. ఆపై రోహిణి కార్తె తోవడంతో సూరీడు తన ప్రతాపం మరింత చూపడంతో ఇల్లు దాటి కాలు బయటపెట్టేందుకు పారిశ్రామికవాడలో జనం జంకుతున్నారు. జిల్లాలో వారం 46 డిగ్రీల సెంటిగ్రేడ్​ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం కోల్​ బెల్ట్ ప్రాంతమైన రామగుండం, ఎన్టీపీసీ, […]

Read More

బాబోయ్​ ఎండలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: భానుడు ఇప్పటికే భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు సుర్రుమంటున్నాడు. వచ్చే ఐదురోజుల పాటు దేశవ్యాప్తంగా ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటిగ్రేడ్​ వరకు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు మండే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ […]

Read More