సారథి న్యూస్, శంషాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇంధనం, గ్యాస్ ధరలు అధికంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులుగా ఎమ్మెల్సీ సురభివాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌చేశారు. ధరలు తగ్గే వరకు పేదల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. చదువుకున్న మేథావులంతా పెరుగుతున్న ధరలపై ఆలోచన చేయాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాంపల్లి గృహకల్ప వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే సీతక్క, అధికార […]
సారథి న్యూస్, యాచారం: బీఫ్ తినేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టబొమ్మను ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో దహనం చేశారు. కేవీపీఎస్ పిలుపుమేరకు కొత్తపల్లి గ్రామంలో భారీ ర్యాలీ తీసి రాజాసింగ్ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కావలి జగన్, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోరెటి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ఎమ్మార్పీఎస్ […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మాయమాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు అన్యాయం చేసిందన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో పార్టీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన గొల్ల కురుమలకు రూ.3వేల పింఛన్, రూ.ఆరులక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న జిల్లా […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు నిరంతరం కృషిచేస్తామని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందుకెళ్తుందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ యాదవ్, […]
సారథి న్యూస్, మెదక్: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందువులే కాదు ముస్లింలు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు విరాళాలు అందజేయడం విశేషం. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహమ్మద్, అక్రం, ఖదీర్, ఇసాక్, మహమ్మద్ సమీర్, మౌలానా, హర్షద్, అహమ్మద్, ఇమ్రాన్, రామమందిర నిర్మాణ తీర్థ ట్రస్ట్ […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన యువకులతో పాటు, చేగుంట మండలం పొలంపల్లి గ్రామ యువకులు కలిసి మొత్తం 50 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం […]
సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం […]