Breaking News

బీజేపీ

కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్​ నీట మునిగిందని మున్సిపల్ ​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ​ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]

Read More
రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్​లోని ఆర్​టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో […]

Read More
దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

దళిత ఎమ్మెల్యేలపై దాడి హేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాల దాడి హేయమైనచర్య అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేపై దాడిచేసిన దుండగుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు […]

Read More
దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలంగాణ భవన్​లో గురువారం చిట్ చాట్ చేశారు. ఆర్ బీఐ తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రుణాలు అత్యధికంగా మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా డబ్బా మేం కొట్టుకోవడం కాదు. ఇది ఆర్​బీఐ నివేదిక చెబుతుందన్నారు. మొత్తం రూ.27,718 కోట్లు రుణమాఫీకి నిధులు వెచ్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుకు మరో రూ.28వేల కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా, ఇన్​పుట్ సబ్సిడీకి […]

Read More
బీజేపీ నేతల అరెస్ట్​అక్రమం

బీజేపీ నేతల అరెస్ట్ ​అక్రమం

సారథి న్యూస్, బిజినేపల్లి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ ​చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే మంత్రి టి.హరీశ్​రావును రంగంలోకి దించి పోలీసులతో రఘునందన్​రావు బంధువుల ఇంటికి పోలీసుల సహాయంతో డబ్బులు పంపించారని విమర్శించారు. మాజీ ఎంపీలు వివేక్, ఏపీ జితేందర్​రెడ్డి అక్రమంగా అరెస్ట్ ​చేశారని ఖండించారు. అనంతరం […]

Read More
సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

కేంద్రానికి లేఖ రాస్తానన్న డీకే అరుణ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ […]

Read More

దుబ్బాకలో కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ

సారథిన్యూస్​, సిద్దిపేట: దుబ్బాకలో ఉప ఎన్నికల జరుగుతున్న వేళ కాంగ్రెస్​పార్టీకి షాక్​ తగిలింది. దుబ్బాక నుంచి టికెట్​ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ సీనియర్​ నేతలు నరసింహారెడ్డి, మనోహర్​రావు పార్టీకి గుడ్​బై చెప్పారు. శుక్రవారం వారు మంత్రి హరీశ్​రావు సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరారు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించిన అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. నవంబరు 3న […]

Read More
దుబ్బాకలో త్రిముఖ పోరు

దుబ్బాకలో త్రిముఖ పోరు

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్​ సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రముఖంగా త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఎవరికివారు బలనిరూపణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రపోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తన […]

Read More