Breaking News

కరీంనగర్

గీత కార్మిక సంఘం ఎన్నిక

గీత కార్మిక సంఘం ఎన్నిక

సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో కౌండిన్య సర్వాయి పాపన్న గీత కార్మికసంఘం గ్రామ అధ్యక్షుడిగా పాకాల మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడిగా పెరుమండ్ల వీరేశం గౌడ్, కౌండిన్య యువజన విభాగం అధ్యక్షుడిగా సుద్దాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా పెరుమండ్ల శ్రీనివాస్ గౌడ్, ఇతర సభ్యులను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన అధ్యక్షుడు గౌడ సంఘం యొక్క బలోపేతానికి, ఐక్యతకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ […]

Read More
‘మేము’న్నాం..

‘మేము’న్నాం..

సారథి న్యూస్​, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేటలో సోమవారం ‘మేము’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రోగులకు సాయం అందించారు. కరోనా బాధితుడి కుటుంబానికి 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థఫౌండర్ పాకాల మహేశ్​గౌడ్, సభ్యులు కల్లేపల్లి లక్ష్మణ్, ముదుగంటి సురేశ్​, వెంకటరమణ, ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, మహిపాల్, గంగస్వామి పాల్గొన్నారు.

Read More

ఆటోడ్రైవర్లకు మాస్కుల పంపిణీ

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ నాయకుడు మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్​ మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య, జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, చందు, తౌఫిక్, మంథని మధు తదితరులు పాల్గొన్నారు.

Read More
రామడుగులో హరితహారం

అటవీ శాతాన్ని పెంచాలి

సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీరణాన్నీ 33 శాతానికి పెంచాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు తహసీల్దార్​ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రకృతి వనాన్ని తలపించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రామడుగు తహసీల్దార్​ చింతల కోమల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్​ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, వివిధ […]

Read More
వృద్ధులకు వైద్య చికిత్సలు అందిస్తున్న సిబ్బంది

వృద్ధులకు ఆలన

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడగు, శ్రీరాములపల్లిలో వైద్య ఆరోగ్యశాఖ వృద్ధుల కోసం ‘ఆలన’ అనే ఓ ప్రత్యేకకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించి.. వారికి అవసరమైన మందులు అందజేశారు. బీపీ, షుగర్​, పక్షవాతం, క్యాన్సర్​తో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్లు సయ్యద్, అబ్దుల్ రఫె, వైద్యసిబ్బంది శ్రీనివాస్, రమణమూర్తి, సంధ్య, శ్రీలత, రాజేశ్వరి, బూదమ్మ, ఆశాలు మమత, అంజమ్మ, సుజాత […]

Read More
పెట్రో ధరలు తగ్గించండి

పెట్రో ధరలు తగ్గించండి

సారథి న్యూస్, చొప్పదండి: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజల్,పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎన్టీఆర్​చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వరకు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​రజితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్​మేడిపల్లి సత్యం, పట్టణాధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ముద్దం తిరుపతి, గుర్రం రమేష్ పాల్గొన్నారు.

Read More

మట్టి తరలింపును అడ్డుకోండి

సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యుడు గడిపె మల్లేశ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, […]

Read More
పీవీ.. రాజఠీవి

పీవీ.. రాజఠీవి

సారథి న్యూస్, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానిపాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) జన్మించి జూన్ 28వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి కావడంతో కుటుంబసభ్యులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో 1921 జూన్​28న ఆయన జన్మించారు. ఆయన తప్పటడుగుల వేసిన నుంచి యవ్వనం వరకు ఉన్న తన ఇంటినే మ్యూజియంగా చేయాలని పీవీ తనయుడు ప్రభాకర్ రావు సంకల్పించారు. తాను 1952లో నిర్మించిన ఇంట్లో […]

Read More