Breaking News

వరంగల్

దళితుల అభ్యున్నతే ధ్యేయం

దళితుల అభ్యున్నతే ధ్యేయం

సారథి న్యూస్​, నర్సంపేట: దళితుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. దళితులు ఆర్థిక పరిపుష్టిని సాధించే విధంగా పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం పాడి గేదేల పంపిణీ కింద రూ.17.70కోట్లను విడుదల చేసి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో ఆరంభించిందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పాడి గేదెల పంపిణీ జరుగనునన్నట్లు తెలిపారు లబ్ధిదారులపై ఎలాంటి భారం […]

Read More
మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకుంటాం

మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకుంటాం

సారథి న్యూస్​, ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వయంగా  ఆ జిల్లా ఓఎస్​డీ కె. సురేష్ కుమార్ ఆయుధాన్ని చేతబట్టి స్పెషల్ పార్టీ సీఆర్పీఎఫ్​ బలగాలతో అర్ధరాత్రిలో ములుగు జిల్లాలో కూంబింగ్​ నిర్వహించారు. మావోయిస్టుల వారోత్సవాల  నేపథ్యంలో వారి కదలికలపై నిఘావర్గాల సమాచారాన్ని సేకరిస్తూ వ్యూహాత్మకంగా వారిని నిరోధించడంలో పోలీస్ బలగాలకు మార్గనిర్దేశం చేశారు.

Read More
జనజీవన స్రవంతిలో కలవండి

జనజీవన స్రవంతిలో కలవండి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): మావోయిస్టులు వారోత్సవాల పేరుతో బంద్ లు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, వారికి సహకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మావోయిస్టులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోవడంతో ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు. అడవుల్లో ఉండే గిరిజనులకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన అందకుండా పురోగతికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడకుండా […]

Read More
ఇంటింటికీ వైద్యపరీక్షలు

ఇంటింటికీ వైద్యపరీక్షలు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా మెురుమూరు గ్రామపంచాయతీలో శుక్రవారం వాజేడు వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించింది. అనంతరం ‘ప్రైడే డ్రైడే’ నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనివాస్, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు.

Read More
అందరికీ కరోనా టెస్టులు చేయాలి

అందరికీ కరోనా టెస్టులు చేయాలి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): అందరికీ కరోనా టెస్టులు చేయాలని టీఏజీఎస్ అధ్యక్షుడు దబ్బకట్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేయాలని డిమాండ్​చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని కోరారు. ప్రతి రేషన్​కార్డుదారుడికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఉపాధి పనిదినాలు రెండొందల రోజులకు పెంచాలన్నారు. రోజుకు రూ.600 వేతనం ఇస్తూ.. ఫీల్డ్​ అసిస్టెంట్లతో పనులు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం ఇంటివద్దకే పంపించాలని, […]

Read More
మావోయిస్టు కరపత్రాల కలకలం

మావోయిస్టు కరపత్రాల కలకలం

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్​ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ […]

Read More

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సీతక్క విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రమణా కర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Read More
ఊరూరా మొక్కలు నాటాలె

ఊరూరా మొక్కలు నాటాలె

సారథి న్యూస్​, మహబూబాబాద్​: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ భవనం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆదివారం మొక్క నాటి నీళ్లు పోశారు. ఊరూరా హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, కెఎస్ఎన్ […]

Read More